సంగెం మండలంలోని నల్లబెల్లి గ్రామంలో కూస సరోజన. కూస రాజేశ్వరరావు భార్య సరోజ ఈ నెల నాలుగో తేదీన తన ఇంటి వద్ద పనులు చేసుకుంటూ కట్టెల పొయ్యి అంటించి తన పనులను చేసుకుంటూ చీర కొంగు జారి మంటలో పడిన విషయము మరచిపోయింది తన పనులు తాను చేసుకుంటూ. చీరతో సహా ఆమె దేహమంతా సగభాగం మహిళా దేహము కాలడంతో సమీపంలో ఉన్న భర్త రాజేశ్వరరావు.మరియు ఇంటి ప్రక్కల వారు సదానందం మల్లయ్య మొదలగువారు గమనించి నిప్పులను చల్లార్చి వెంటనే అంబులెన్స్ ద్వారా వరంగల్ కు ఎంజిఎం హాస్పిటల్ కి తరలించారు వైద్యుల సలహా మేరకు హైదరాబాదులో యశోద హాస్పిటల్ కి పంపించారు. ట్రీట్మెంట్ తీసుకుంటూ.ఈ నెల 9న సరోజ మరణించింది ఈ విషయము స్థానిక సంగెం పోలీస్ స్టేషన్ ఎస్ఐ, భరత్ తెలిపారు. వివరాల ప్రకారం మృతురాలికి ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు చిన్నకూతురు ప్రసవం కోసం తల్లిగారింటికి వచ్చింది.ఈ విషయంపై ఎవరిపైన ఎటువంటి అనుమానాలు లేవని కుటుంబ సభ్యులు తెలియజేశారు.
ప్రమాదవశాత్తు చీర కొంగు మంటల్లో చిక్కుకుని మహిళా మృతి
RELATED ARTICLES