యన్టీఆర్ జిల్ల నందిగామ లో గల ఎ.పీ. ఎన్జీఓ. హోమ్ లో శుక్రవారం జరిగిన జాబ్ మేళాలో మొత్తం 36 మంది అభ్యర్ధులు పాల్గొనగా అందులో కురాకు ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ 21 మందిని షార్ట్ లిస్టు చేసినట్లు ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్ శ్రీ ఎం. రమేష్ బాబు తెలిపారు. యువత ప్రస్తుత పోటీ ప్రపంచంలో డిగ్రీలు సర్టిఫికెట్లు కాకుండా విభిన్న నైపుణ్యాలను ప్రదర్శిస్తేనే ఉద్యోగాలు పొందగలుగుతారని ఆయన తెలిపారు. షార్ట్ లిస్టు చేసిన వారికి సదరు కంపెనీ నుండి అధికారిక ఉత్తర్వులు జారీ చేయబడతాయి. ఉద్యోగాలు పొందిన మహిళ అభ్యర్థినులకు ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు. ఎంపిక కాబడినవారికి ఆయన అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా నైపుణ్యాభివృద్ది అధికారి, శ్రీ ఎస్. శ్రీనివాసరావు, నందిగామ కో – ఆర్డినేటర్ శ్రీ చరణ్, శ్రీను తదితరులు పాల్గొన్నారు…
ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాల వారి ఆధ్వర్యం లో ఉద్యోగాలు పొందిన అభ్యర్థినులకు నియామక పత్రాలు అందజేత
RELATED ARTICLES