Monday, December 23, 2024

ప్రజా వీరుడు పండుగ సాయన్న ముదిరాజ్ 134 వ వర్ధంతి

*నా పుట్టుక తెలియదు- మరణం ఎప్పుడో తెలియదు- కానీ నా బతుకంతా ప్రజల ఆకలి తీర్చడం కోసమే*
**ప్రజా వీరుడు” పండగ సాయన్న ముదిరాజ్*
**చరిత్ర పుటల్లో చేరని బహుజన బిడ్డ*
*జానపద పల్లెగుండె ల్లో ఆటై..పాటై తీరు*

/- *జిల్లా అధ్యక్షులు  డాక్టర్ భట్టు విఠల్ ముదిరాజ్*
***
నా పుట్టుక తెలియదు – మరణం ఎప్పుడో తెలియదు- కానీ నా బతుకంతా ప్రజల ఆకలి తీర్చడం కోసమే నా పోరాటం”అంటూ సామాన్య జనులకు కోసం జీవితాంతం పోరాటం చేసిన తెలంగాణ రాబిన్ హుడ్ పండగ సాయన్న ముదిరాజ్ అని జిల్లా అధ్యక్షులు డాక్టర్ భట్టు విఠల్ ముదిరాజ్ అన్నారు.
అరాచక పాలనకు వ్యతిరేకంగా  ఉద్యమించి..పేద ప్రజల కోసం జీవితాంతం ఉద్యమం  చేసిన”తెలంగాణ రాబిన్ హుడ్” పండగ సాయన్న ముదిరాజ్ అని కొనియాడారు.
కామారెడ్డి జిల్లాలో  ప్రజా వీరుడు  పండుగ సాయన్న ముదిరాజ్ 134 వ వర్ధంతి ఘనంగా నివాళులుఅర్పించిన కామారెడ్డి జిల్లా అధ్యక్షులు డాక్టర్ బట్టు విఠల్ ముదిరాజ్. ఈ  సందర్భంగా తెలంగాణముదిరాజ్ మహాసభ  ఆధ్వర్యం లో పండుగసాయన్న ముదిరాజ్ వర్ధంతిని పురస్కరిం చుకొని జిల్లా అధ్యక్షులు డాక్టర్. బట్టు.విఠల్, ముదిరాజ్ మాట్లాడుతూ ” *ప్రజా వీరుడు* *తెలంగాణ రాబిన్ హుడ్,ప్రజల స్వేచ్ఛ స్వాతంత్రం,కోసం పోరాడిన మహా యోధుడు..పండగ సాయన్న ముదిరాజ్  అని కొనియాడారు పెత్తందారి వ్యవస్థపై భూస్వామ్య వ్యవస్థ పై రాజీలేని పోరాటం చేసిన ధీరుడు… బహుజన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపిన సూర్యుడు పండగ సాయన్న ముదిరాజ్ అని శ్లాఘించారు. ఉదయించే సూర్యుడిని సైతం నిలువరించే శక్తిని కల్గిన బాహుబలి పండగ సాయన్న ముదిరాజ్ అని అన్నారు.సమాజం లోని ప్రజల థీన స్థితిగతులను అధ్యయనం చేసిన  సామాజిక వేత్తగా.. యువతరానికి ‘చేగువేరై”ఆశాజ్యోతి గా నిలచాడన్నారు. అణగారిన వర్గాలకు అండగా నిలుచిన దార్శనికుడు…  నిజాం సర్కారు అరాచక పాలనకు.. వ్యతిరేకంగా  పోరాటం చేసిన వీరుడు పండగ సాయన్నముదిరాజ్*అని ఆయన పీడిత ప్రజల పక్షాన నిలిచినా ఆ వర్గాల కు అండగా ఉంటూ పోరాటం చేసిన “ప్రజా వీరుడు” పండుగ సాయన్న ముదిరాజ్ అని కొనియాడారు. అన్ని వర్గాల ప్రజలకు ధైర్యాన్నిస్తూ” కంచంలో ‘అన్నo’మై *గుండెలో ధైర్యమే* *అందరినోట “అన్న”గా జగపతికెక్కిన ప్రజా వీరుడు పండగ సాయన్న ముదిరాజ్ గా ఖ్యాతి నొందాడు*  *ప్రజల నోట పాటగా ఆటగా నిలిచిన పల్లె పల్లెల్లో జానపద పదమైయాడు* *తెలంగాణ ప్రజల గుండె చప్పుడుగా నిలిచాడని ఆయన వివరించారు
*సకల సంపద కలిగిన వాన్ని కొట్టి ఆకలితో అలమటిం చే జనానికి అన్నం  పంచిపెట్టి… వారికి తోబుట్టువుగా నిలిచిన “అన్నగా” ఖ్యాతిని ఆర్జించిన పండగ సాయన్న ముదిరాజ్ అని వివరించారు* పాలమూరు ప్రాంత ప్రజలతో ఆత్మీయ బిడ్డాయే పండుగ సాయన్న ముదిరాజ్ అని కొనియాడారు. *జోహార్…జోహార్ పండుగ సాయన్న ముదిరాజ్ అని నినదించారు* . ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు డాక్టర్. భట్టు.విఠల్ ముదిరాజ్ ఉపాధ్యక్షులు జిల్లా ప్రధాన కార్యదర్శి కొరివి నరసింహులు బీబీపేట మండల చెందినతూర్పు రాజు ముదిరాజ్, రఘురామయ్య ముదిరాజ్.కొరివి.నర్సింలు ముదిరాజ్ జి.లింగమేశ్వర్ ముదిరాజ్, డి.సాయికుమార్ ముదిరాజ్ .తెలంగాణ ముదిరాజ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నాయకులు స్వామి ముదిరాజ్,శ్రీనివాస్ ముదిరాజ్,లక్ష్మణ్ ముదిరాజ్,శివ ముదిరాజ్, సాయిబాబా ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular