కల్తీ జరిగితే కేల్ కతం
ప్రజల ఆరోగ్యాలతో ఆడుకుంటే సహించేది లేదు.
ప్రతి హోటల్లో నిఘా నేత్రాలను ఏర్పాటు చేసుకోవాలి.
ఒక్క నిఘానేత్రం 100 మంది పోలీసులతో సమానం.
ఎస్సై తాజుద్దీన్
ఏటూరు నాగారం మండల కేంద్రంలోని హోటల్స్ రెస్టారెంట్ల యజమానులతో ఏటూరు నాగారం ఎస్సై తాజుద్దీన్ అవగాహన సమావేశాన్ని నిర్వహించారు. వారు మాట్లాడుతూ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా సూచించిన నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలని వారిని కోరారు.
వ్యాపారస్తులు వారి వారి వ్యాపార సముదాయాల ముందు నిఘా నేత్రాలను ఏర్పాటు చేసుకోవాలని. తద్వారా సమాచార సేకరణ సులువు అవుతుందని, ఎటువంటి క్రైమ్ జరిగిన ముందుగా గుర్తించిఅరికట్టే దిశగా అడుగులు వేసే వెసులుబాటు నిఘా నేత్రాల ద్వారా ఉంటుంది అని వారికి తెలిపారు. ఒక సీసీ కెమెరా 100 మంది పోలీసులకు సమానమని
దొంగతనాలు జరిగినప్పుడు. నిందితులను గుర్తించడంలో సీసీ కెమెరాలు పాత్ర ఎనలేనిదని వారన్నారు. ప్రతి ఒక్కరూ సీసీ కెమెరాల విషయంలోనూ ఫుడ్ సేఫ్టీ విషయంలోనూ నిబంధనలు పాటించి సహకరించాలని ఈ సందర్భంగా హోటల్ యజమానులను కోరారు. గత కొంతకాలంగా హోటల్లో వంట నూనె రీసైక్లింగ్ చేస్తున్నారని, వంట మాస్టర్లు సైతం పరిశుభ్రత పాటించట్లేదని, నిషేధిత రంగులు అధిక మోతాదులో మసాలాలు వాడి ప్రజల ప్రాణాలకు ముప్పు తెచ్చే ప్రయత్నం జరుగుతున్నట్లు వినిపిస్తున్నందున, ప్రజల ప్రాణాలతో ఆడుకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నిబంధనలకు విరుద్ధంగా ఎవరు ఆహార పదార్థాలను తయారు చేయద్దు అని హెచ్చరించారు. ఆహార పదార్థాల వల్ల ప్రజలకు ఎటువంటి హాని జరిగినా హోటల్ యాజమాన్యాలపై కఠినమైన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలిపారు.
ప్రజల ఆరోగ్యాలతో ఆడుకుంటే సహించేది లేదు :ఎస్సై తాజుద్దీన్
RELATED ARTICLES