TEJA NEWS TV :
తేజ న్యూస్ టివి ప్రతినిధి, సంగెం.
మహిళలు మానవ అక్రమ రవాణా పట్ల అవగాహనతో కూడిన అప్రమత్తత కలిగి ఉండాలని సంగెం ఎస్సై నరేష్ తెలిపారు .శాంతి మండల సమాఖ్య ఆఫీసులో వివోఏ లకు,వివో అధ్యక్షులకు మానవ అక్రమ రవాణా పై ఏర్పాటుచేసిన సదస్సులో ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. మన చుట్టూ ఉండే మోసపూరిత మనుషులే అమాయక ప్రజలను టార్గెట్ చేసి బాండెడ్ లేబర్ గా, సెక్స్ వర్కర్ గా మారుస్తున్నారని తెలిపారు. ప్రజల పేదరికాన్ని ఆసరా చేసుకొని, అమాయకపు నిస్సహాయ స్థితిలో ఉన్న మహిళలను,బాలబాలికలకు ఉద్యోగ అవకాశాల పేరుతో డబ్బు ఆశ చూపి సెక్స్ వర్కర్లుగా,బాండెడ్ లేబర్లుగా వివిధ మెట్రోపాలిటన్ నగరాలలో అమ్ముచున్నారని తెలిపారు. అభంశుభం తెలియని చిన్నారులను సైతం కిడ్నాప్ చేసి భిక్షాటన కోసం అవయవాల మార్పిడి కోసం లైంగిక వాంఛ తీర్చుకోవడం కోసం మానవ అక్రమ రవాణా కు పాల్పడుతున్నారని తెలిపారు. కావున స్వయం సహాయక సంఘాలలోని మహిళలు వారి నెలవారి మీటింగ్లలో ప్రత్యేక ఎజెండాగా మానవ అక్రమ రవాణా ను చేర్చుకొని గ్రామీణ ప్రాంతంలోని ప్రజలను అవగాహన కల్పించుటకు వివోఏలు నడుంబిగించాలని తెలిపారు. వివోఏలకు ప్రతి కుటుంబంతో మంచి సంబంధాలు కలిగి ఉంటారు, కావున అన్ని కుటుంబాలలో ఈ మానవ అక్రమ రవాణాపై అవగాహన కల్పించుటలో ముఖ్యపాత్ర పోషించాలని తెలిపారు. మానవ అక్రమ రవాణా ఆధునిక బానిసత్వంగా పేర్కొనవచ్చు అని తెలిపారు. లైంగిక వ్యాపారం కూడా ఒక పరిశ్రమలాగా అభివృద్ధి చెందుతుంది, కావున దీని పట్ల ప్రజలు చైతన్యంతో మెదలాలని తెలిపారు. ఇట్టి విషయంలో స్వయం సహాయక సంఘాల లీడర్లకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని ఎస్ఐ నరేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల సమైక్య అధ్యక్షురాలు కళ్యాణి కార్యదర్శి రాజమణి ఎపిఎం దుంపేటి కిషన్ సీసీలు కుమారస్వామి రాజయ్య కృష్ణమూర్తి సురేష్ ఏలియా ఆఫీస్ సిబ్బంది కృష్ణ సుజాత శివరాజ్ వివో ఏలు కృష్ణవేణి విజయ మంజుల రాణి సువర్ణ మొదలగు వారు పాల్గొన్నారు.
ప్రజలు అవగాహనతో అప్రమత్తంగా ఉండాలి – సంగెం ఎస్ఐ ఎల్. నరేష్
RELATED ARTICLES