ఈరోజు ఇస్సానగర్ లో పౌర హక్కుల దినోత్సవ అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది దళిత స్త్రీల గౌరవాన్ని భంగం పరిచే లేక మర్యాదను మంటగలిపే ఉద్దేశంతో వారిపై బల ప్రయోగం చేసిన స్త్రీలపై లైంగిక దాడి చేసిన షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగలకు చెందిన వారికి కేటాయించిన భూములను అక్రమంగా ఆక్రమించిన సాగుచేసిన లేక భూమిని బదిలీ చేసిన వారితో బలవంత పనులు చేయించిన వెట్టిచాకిరి చేయించిన కులం పేరుతో దూషించిన వారిపై కఠిన చర్యలు తీసుకునే హక్కు అవకాశాలు షెడ్యూల్ కులాల వారికి ఉన్నాయని కాబట్టి ఎవరైనా కించపరిచినట్టు మాట్లాడిన యెడల మీరు చట్ట పరంగా చర్యలు తీసుకుని అవకాశం ఉందని అవగాహన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇస్సానగర్ గ్రామ సర్పంచ్ గారు బిబిపేట్ రెవెన్యూ జూనియర్ అసిస్టెంట్ ముదాo చిరంజీవి గారు హెడ్ కానిస్టేబుల్ మల్లేష్ గారు వార్డెన్ యాదగిరి గారు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.



