పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా సంస్కరణ దినం కార్యక్రమాలు బీబీ పేట మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించబడ్డాయి. మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, పోలీసులు కలిసి అమరవీరులకు నివాళులర్పించారు.
తరువాత విద్యార్థులు గ్రామంలో ర్యాలీ నిర్వహించి, “పోలీస్ అమరవీరులు అమరులు” అంటూ నినాదాలు చేశారు. ర్యాలీ అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్సై ప్రభాకర్ ఆధ్వర్యంలో పోలీస్ హౌస్ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా ఎస్సై ప్రభాకర్ మాట్లాడుతూ — సమాజం పట్ల పోలీసుల కర్తవ్యాలు, బాధ్యతలు, సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఆధునిక పోలీస్ వ్యవస్థ ప్రాముఖ్యత గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు.
కార్యక్రమంలో గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ చందు రాథోడ్, ఉపాధ్యాయులు రాజు, శంకర్, పద్మ, బల్వంత్ రావు, కానిస్టేబుల్ అర్చన, స్వప్న, రమేష్, పాయస్, హైమద్, శంకర్ తదితరులు, విద్యార్థులు మరియు పోలీస్ బృందాలు పాల్గొన్నారు.
పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా బీబీ పేటలో సంస్కరణ దినం
RELATED ARTICLES



