


నంద్యాల, డిసెంబర్ 21 (తేజ న్యూస్ టీవీ):
పోలియో రహిత సమాజాన్ని నిర్మించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని నంద్యాల జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణియా పిలుపునిచ్చారు. ఆదివారం నంద్యాల పట్టణం, నూనెపల్లి ప్రాంతంలోని ఠాగూర్ పురపాలక ప్రాథమిక పాఠశాలలో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ స్వయంగా చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఐదేళ్ల లోపు చిన్నారులందరికీ పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించాలని తల్లిదండ్రులకు సూచించారు. పిల్లల ఆరోగ్య భవిష్యత్తు కోసం ప్రభుత్వం చేపడుతున్న ఈ కార్యక్రమంలో ప్రజలందరూ బాధ్యతగా సహకరించాలని కోరారు.
పాల్గొన్న ప్రముఖులు:
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌తో పాటు జాయింట్ కలెక్టర్ కొల్లా బత్తుల కార్తీక్ గారు, రాష్ట్ర వైద్యశాఖ జాయింట్ డైరెక్టర్ దేవసాగర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి (DM&HO) డాక్టర్ వెంకటరమణ మరియు ఇతర వైద్య సిబ్బంది, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.



