తిరుపతి జిల్లా వరదయ్య పాలెం మండలం లోని పాండూరు పంచాయతీలోని అరుణానది ఉదృతంగా ప్రవహిస్తుండడంతో అలాగే *_ఆంబికాపురం_* రాళ్ళ వాగు వరదలకు పొంగడంతో నాగనందపురం, వడ్డీపాలెం, తొండంబట్టు, ఎంజినగర్ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అంతే కాక వరదయ్యపాలెం లోని గోవర్ధనాపురం బ్రిడ్జి కుడా చాలా ఉద్రుతంగా ప్రవహిస్తుంది.అంతే అత్యవసర పరిస్థితుల్లో కూడా రోడ్డు దాటే పరిస్థితి లేదు మరీ ముఖ్యంగా గత మిచౌంగ్ తుఫానులో ఇదే పరిస్థితి వచ్చి అతలాకుతలమైన విషయం అందరికీ తెలిసిందే అయిన అప్పటి ప్రభుత్వం జనజీవనాన్ని పట్టించుకోకపోవడం చిద్రమైన రోడ్లను కనీసం పిరికేడు మట్టి వేసిన దాఖలాలు కనీసం కంటి చూపు మేరలో కనిపించలేదు. అంతలోనే ఇప్పుడు డిసెంబర్ నెలలో అనుకొని తుఫానులా వచ్చిన ఈ వర్షo రావడంతో ప్రజలు భయనకానికి లోనవుతున్నారు. ఈ ప్రభుత్వమైనా ప్రజల కష్టాలకు అనుగుణంగా రోడ్లు, చెరువులు, కుంటలు, కోతలకు గురి అయిన వాటిని బాగు చేసి పంట నష్టపోతున్న రైతులను సకాలంలో ఆదుకుంటుందని గంపేడు ఆశతో ఎదురు చూస్తున్న ప్రజలు…
పొంగి పొల్లుతున్న రాళ్లవాగు – నాలుగుగ్రామాలకు రాకపోకలు అంతరాయం
RELATED ARTICLES