
TEJA NEWS TV :
Reporter : రంగదామప్ప
శ్రీ సత్య సాయి జిల్లా గుడిబండ పోలీస్ స్టేషన్ ఎస్ ఐ ముని ప్రతాప్ కు పేకాట జూదం గురించి రాబడిన ఖచ్చితమైన సమాచారం మేరకు, గుడిబండ పోలీస్ స్టేషన్ ఎస్ ఐ ముని ప్రతాప్ మరియు వారి సిబ్బందితో కలిసి ఈ రోజు అనగా 23.03.2023 తేదిన ఉదయం గుదిబండ గ్రామం, శ్రీ తుమ్మల మారెమ్మ గుడి సమీపమున బహిరoగ స్థలములో కొంతమంది కూర్చొని, డబ్బులను ఫణంగా పెట్టి “లోపల-బయట’ అను గ్యాంబ్లింగ్ అను జూదమును ఆడుతూ ఉండగా వారిని సిబ్బంది సహాయంతో రైడ్ చేసి గుడిబండ మండలానికి చెందిన మొత్తం 29 మందిని అదుపులోకి తీసుకుని, వారి నుండి మొత్తం 78,200/- (డెబ్బై ఎనిమిదివేల రెండు వందల రూపాయలు) నగదు, లోపల-బయట ఆడు 52 పేక ముక్కలు రెండు ప్యాకులను, మరియు మొత్తం 27 ద్విచక్ర వాహనములు స్వాధీనం చేసుకొని సీజ్ చేసి వీరి అందరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ ఐ ముని ప్రతాప్ తెలిపారు. ఈ మెరుపుదాడిలో ఏఎస్ఐ చంద్ర శేఖర్, కానిస్టేబుల్స్ రఫీ, చంద్ర నాయక్ , వెంకటేష్, లక్ష్మి కుమార్ , తదితరులు పాల్గొన్నారు .



