
TEJA NEWS TV :
పెద్ద హరివణం ఆసుపత్రిని వంద పడకల ఆసుపత్రిగా నిర్మించి పేద ప్రజలకు వైద్యం అందించండి: జనసేన ఆదోని
నాలుగవ రోజు ప్రభుత్వ ఆసుపత్రులు పరిశీలనలో భాగంగా
పరిశీలన అనంతరం జనసేన నాయకులు యం.తాహేర్ వలి,పులి రాజు , నాగరాజు మాట్లాడుతూ
కర్నూలు జిల్లా ఆదోని మండలం పెద్ద హరివాణం గ్రామంలో 1993లో ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలన్న ఉద్దేశంతో 30 పడకల ఆసుపత్రిని నిర్మించడం జరిగింది. ప్రస్తుత పార్టీలు పాలకులు మాత్రం అభివృద్ధి మేము చేసామంటే లేదు మా ఆయంలోనే జరిగిందని గొప్పలు చెప్పుకుంటున్న మరి వారు చేసిన గొప్పతనం ఏమిటో ఆదోని మండలంలోని పెద్ద హరివాణం గ్రామంలో ఉన్న 30 పడకల ఆసుపత్రిని ఎనిమిది పడకల ఆసుపత్రిగా తగ్గించినా ఏమి మాట్లాడకుండా మౌనంగా ఉన్నారంటే ఏ రకమైనటువంటి అభివృద్ధి ప్రజలు ఒకసారి ఆలోచించుకోవాలి.
వైద్యానికి పెద్దపీట వేసామని గొప్పలు చెప్పుకుంటున్న వైసీపీ ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న 30 పడకల ఆసుపత్రిని తగ్గించి ఎనిమిది పడకల ఆసుపత్రిగా మార్చడం అంటే ఏ రకమైనటువంటి పెద్దపీట వేశారు వైసీపీ ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ఇదే గ్రామంలో ఉన్న ఆసుపత్రిలో సరైన మందులు అందుబాటులో లేక వైద్యులు వైద్య సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో మెరుగైన వైద్యం అందడం లేదని ఈ గ్రామ సర్పంచ్ తో పాటు , అభ్యుదయ సంఘం నాయకులు వివిధ ప్రజా సంఘాల నాయకులు అనేకసార్లు పత్రిక ద్వారా ప్రభుత్వాన్ని విమర్శించిన దాఖలాలు ఉన్నాయి.మరి ప్రభుత్వము పాలకులు మాత్రం అన్ని రకాల అభివృద్ధి చేశామని గడపగడప కార్యక్రమంలో కూడా గౌరవ శాసనసభ్యులు వారు మాట్లాడుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి అభివృద్ధి అంటే పేద ప్రజలకు మౌలిక వసతులు వైద్య సేవలు ఉపాధి అవకాశాలు ఉండగలిగితే నిజమైన అభివృద్ధి పని మనందరికీ అర్థమవుతుంది. మరి పాలకులకు మాత్రం ఏ రకంగా అభివృద్ధి కనిపిస్తుందో వారే సమాధానం చెప్పాలి అని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వము పాలకులు ఆలోచించి కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో ఉన్నటువంటి పెద్ద హరివాణం ఆసుపత్రిని వంద పడకల ఆసుపత్రిగా నిర్మించి పరిసర ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. అన్ని రకాల సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే విధంగా చూడాలని కోరారు ఈ కార్యక్రమంలో జనసైనికులు ప్రకాష్, మల్లికార్జున, బంగారయ్య, శ్యామ్, చిన్న, ఉరుకుందు, మహేష్, ఓబులేష్, అబ్రహం, గోవిందు, అజయ్, వీరేష్, గోవిందు రాజు, ముని, హసేన్, అయ్యప్ప, వెంకటేష్ , శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.