TEJA NEWS TV :గణేష్ ఉత్సవాల కు సంబంధించి పెద్ద కడబూరు మండల పరిధిలో గణేష్ విగ్రహాలు ప్రతిష్టించే వారందరూ తప్పకుండా కర్నూలు జిల్లా పెద్ద కడబూరు మండల పరిధిలో కంబాలదిన్నె గ్రామంలో ఎస్సై నిరంజన్ రెడ్డి ఏఎస్ఐ శివరాములు వారి సిబ్బందితో కలిసి ప్రజలతో మాట్లాడుతూ పోలీస్ స్టేషన్ లో వివరాలు తెలియపరచి, మీ సేవా ద్వారా గణేశ్ చతుర్థి ఆన్ లైన్ లింక్ నందు కూడా తప్పక పర్మిషన్ కోసం అప్లై చేసు కోవలయును. గణేష్ విగ్రహాలు ప్రతిష్ట నిర్వహణకు 3 రోజులు మాత్రమే అనుమతి ఇవ్వబడును. 3 రోజులకు మించి అనుమతి ఇవ్వబడదు. గణేష్ ఉత్సవాల సందర్భంగా మండపాల వద్ద గాని, నిమజ్జన ఊరేగింపు రోజున గాని డీ.జే లకు అనుమతులు లేవు. మండపాల వద్ద, ఊరేగింపు లో కుల, మత, రాజకీయాలను కించ పరిచే లేదా రెచ్చ గొట్టే విధంగా పాటలు పెట్టిన లేక ఇతర కార్యక్రమాలు నిర్వహించరాదు. పోలీసు శాఖ నియమ నిబంధనలను అతిక్రమిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అదే విధంగా DJ వాహనాలు కూడా సీజ్ చేసి, నిర్వాహకులపై కేసులు నమోదు చేస్తామని పెద్ద కడబూరు యస్.ఐ నిరంజన్ రెడ్డి మండల పరిధిలోని మరియు కోసిగి సర్కిల్ సి.ఐ మంజునాథ్ హెచ్చరించారు.
పెద్దకడబూరు:గణేష్ మండపానికి పోలీస్ పర్మిషన్ తప్పనిసరి
RELATED ARTICLES