Tuesday, September 16, 2025

పెంచిన గ్యాస్ ధరలు వెంటనే తగ్గించాలి ఆదోని డివిజన్ బీసీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం

TEJA NEWS TV :

కర్నూలు జిల్లా ఆదోని న్యూస్

పెంచిన గ్యాస్ ధరలు వెంటనే తగ్గించాలి, ఎలక్ట్రిసిటీ ట్రూ ఆఫ్ చార్జీలు వెంటనే తీసివేయాలి

ఈరోజు ఆదోని డివిజన్ బీసీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు దస్తగిరి నాయుడు అధ్యక్షతన  హోటల్ బీమాస్ రిసెప్షన్ నందు రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడమైనది.
ఈ సమావేశంలో బీసీ నాయకులు రాష్ట్ర ఉపాధ్యక్షులు దస్తగిరి నాయుడు, తాలూకా అద్యక్షులు మరియాని చెన్న బసప్ప, జిల్లా గౌరవ అధ్యక్షులు పి సాయి బాబా, డివిజన్ గౌరవ సలహాదారులు ధనాపురం శేషన్న తాలూకా ఆర్గనైజింగ్ సెక్రటరీ పి షేక్షావలి, పట్టణ అధ్యక్షులు డాక్టర్ వీరేష్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నిన్న పెంచినటువంటి సిలిండర్ కు 50 రూపాయలు పెంచుతూ ప్రకటించడం చాలా విడ్డూరంగా ఉంది గతంలో 2014వ సంవత్సరమున 410 రూపాలు ఉన్న గ్యాస్ ధరను 8 సంవత్సరాల లో అంచలంచెలుగా ధరను పెంచుతూ ఈరోజు 115 5 రూపాయలు చేయడమైనది ఈ 8 సంవత్సరాల కాలంలో 200% ధర పెంచడం సామాన్య ప్రజలకు నడ్డి విరిచినట్లు చేయడం అమాను శము చాలా దారుణం గా ప్రజల పరిస్థితులు ఇబ్బందుల్లో ఉన్నారు వాళ్ల జీవనాధారం చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఎదుర్కొంటున్నారు.  ఇప్పటికైనా ఈ పరిస్థితులలో కరెంట్ బిల్లులైతేనేమి పప్పు దినుసులయితేనేమి ఆయిల్ అయితేనేమి పెట్రోల్ డీజిల్ అయితేనేమి ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతిదీ ప్రజలపై భారము మోపుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మోసం చేస్తూవస్తున్నాయి ఈ ధరలు పెంపుదలకు అంతమే లేదా అనే సందిగ్ధంలో ప్రజలు చాలా దీనవ్యవస్థలో వేడుకుంటున్నారు ప్రభుత్వాలేమో ఇవన్నీటిని ఎప్పటి కప్పుడు పెడ చెవి  పెట్టి యధా రాజా తథా ప్రజా అన్న చందంగా వారి పని వారు చేస్తూనే పోతున్నారు కాబట్టి వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పునరాలోచించుకొని త్వరలోనే ధరలను నియంత్రణ చేయాలని డిమాండ్ చేయడమైనది అదేవిధంగా కరెంట్ బిల్లులు కూడా ఏ సి డి చార్జెస్ అని, వసూలు చేస్తున్నారు. అలాగే కరెంట్ బిల్లులో కూడా ఏకంగా బిల్లుతోపాటు బిల్లులోనే ఒక కాలంలో  ట్రూ అప్ చార్జెస్ అని, ప్రతి నెల  కలుపుతున్నారు. అలాగే 15 తారీకు లోపల బిల్లు కట్టని వారికి సర్ చార్జీలని, వేస్తున్నారు. ఇలానే వివిధ రూపాల్లోన  కరెంట్ బిల్లు ఎంత వస్తే దాంట్లో 50% వరకు ఇలా చార్జెస్ రూపంలో ముక్కు పిండి వసూలు చేస్తున్నారు. ఇది కాక తదుపరి లేటుగా కట్టే వాళ్లకి వంద రూపాయలు ఫైన్ కూడా వేస్తున్నారు. ఈ ట్రూ ఆఫ్ చార్జెస్  ప్రజలకి విషయం తెలియకుండా కరెంట్ బిల్లులోనే కలుపుతూ వస్తున్నారు. కావున ట్రూ ఆఫ్ చార్జెస్, అలాగే సర్ చార్జీలు ఎత్తివేయాలి. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గ్యాస్ ధరను పెట్రోల్ డీజిల్ ధరలు, ట్రూ ఆప్  చార్జెస్  తగ్గించాలని డిమాండ్ చేస్తున్నాం లేనిపక్షంలో మా బీసీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిరసనలు చేపడుతామని డిమాండ్ చేస్తున్నాం
ఈ సమావేశంలో తాలూకా జనరల్ సెక్రెటరీ రమేష్ ఆచారి, తాలూకా గౌరవ సలహాదారులు బి రాముడు బి మల్లేశ్వరప్ప, వీరభద్ర ఆలూరు మాజీ కమిటీ చైర్మన్ జయరాం గర్జప్ప తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular