తేజన్యూస్ టీవీ రిపోర్టర్ పి శ్రీధర్
సెంటర్ ఆళ్లగడ్డ
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం పడకండ్ల గ్రామ సమీపంలో అహోబిలం రోడ్డులో ఉన్న డాక్టర్ నరసింహారెడ్డి గార్డెన్స్ లో సోమవారం 1986-87 10 వ తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థులు సమ్మేళనం ఘనంగా నిర్వహించారు.
ప్రముఖ న్యాయవాది, పూర్వ విద్యార్థి , వ్యాపారవేత్త జయ చంద్రారెడ్డి ఆధ్వర్యంలో పూర్వ విద్యార్థులందరూ ఒకచోట కలిసి ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఎక్కడో స్థిరపడిన స్నేహితులందరూ పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో కలిసి తమ కష్టసుఖాలలో పాలుపంచుకున్నారు. ఈ సందర్భంగా జయచంద్రారెడ్డి ఆధ్వర్యంలో చక్కని విందు భోజనం ఏర్పాటు చేసి అతిథులను సత్కరించారు. అందరినీ ఒక త్రాటిపై చేర్చిన జయచంద్రారెడ్డిని కూడా పూర్వ విద్యార్థులందరూ ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో తేజ న్యూస్ టీవీ ప్రతినిధి ప్యాపిలి శ్రీధర్, ఎస్వీ రాజారెడ్డి, శ్రీనివాసరెడ్డి, పరమేశ్వర్ రెడ్డి, బాబయ్య, పుల్లారెడ్డి, ప్రసాద్, రవి, సుబ్రహ్మణ్యం, రఘు, రామకృష్ణ, కొండారెడ్డి
తదితరులు పాల్గొన్నారు.








