TEJA NEWS TV
రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలో తల్లిదండ్రులు- ఉపాధ్యాయుల సమావేశాన్ని రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 7 న ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది. ఈ నిర్వహణలో భాగంగా డోన్ పట్టణంలోని జడ్పీహెచ్ఎస్ హైస్కూల్,కొత్తపేట గర్ల్స్ హై స్కూల్,అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాలలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ధర్మవరం సుబ్బారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఆయన ముందుగా పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న మసాలా గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిల్లలు చదువుకొని భవిష్యత్తులో రాణించాలంటే ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రుల ప్రోత్సాహం కూడా ఎంతో అవసరం ఈ విషయాన్ని గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులను తల్లిదండ్రులను ఉపాధ్యాయులను పిల్లలు చదువుకున్న చోట అందరిని ఒకచోట కల్పిస్తే పిల్లలు ఏ సబ్జెక్టులో అయితే వెనుక పడ్డారు ఆ సబ్జెక్టు గురించి తల్లిదండ్రులు ఉపాధ్యాయులను అడిగి తెలుసుకుని ఆ సబ్జెక్టులో వారు ఎలా మెరుగుపడాలో సూచనలు సలహాలను తీసుకొని పిల్లలను ఇంటి దగ్గర మెలకువలు నేర్పించవచ్చని ఇలాంటి కార్యక్రమాన్ని కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు.
రానున్న పదవ తరగతి పరీక్షల్లో డోన్ పట్టణంలో మొదటి రెండవ మూడవ స్థానంలో నిలిచిన విద్యార్థులకు 25000,15000, 10,000 రూపాయలను తను బహుమతిగా ఇస్తానని తెలిపారు.
పిల్లల మెదడులో ఉన్న చెడు అలవాట్లను తొలగించి వారిని మంచి మార్గంలో నడిపే బాధ్యత ఉపాధ్యాయులు తల్లిదండ్రులదే…… ధర్మవరం మన్నే సుబ్బారెడ్డి
RELATED ARTICLES