భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ కేజీబీవీ వద్ద ఆదివారం సెలవు దినాన తమ పిల్లలను చూడటానికి వచ్చిన తల్లిదండ్రులు నడి ఎండలో రోడ్డుపైనే నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది. విద్యార్థినీలను కలుసుకోవడానికి వచ్చిన తల్లిదండ్రులను సిబ్బంది గేటు వద్దే ఆపేయడంతో వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
“నిరుపేదలమే కాబట్టే ఇలాంటివి భరించాల్సి వస్తోంది. మా పిల్లల్ని చూడటానికి కూడా ఆంక్షలా?” అని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు .
పిల్లల్ని చూడటానికీ ఆంక్షలేనా? తల్లిదండ్రుల ఆవేదన
RELATED ARTICLES