TEJA NEWS TV
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
తేజ న్యూస్ టీవీ
తేదీ: 10 మార్చి 2025
స్థలం: మణుగూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, ప్రజా భవన్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలో పినపాక ఎమ్మెల్యే
పాయం వెంకటేశ్వర్లు నియోజకవర్గ స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఏడు మండలాల ఎంపీడీవోలు, ఎంపీఓలు, ఏపీఓలు, మిషన్ భగీరథ, ఇంట్రా మరియు మణుగూరు మున్సిపాలిటీ అధికారులు పాల్గొన్నారు.
సమీక్షలో ప్రధానాంశాలు:
✅ ఎండాకాలంలో నీటి ఎద్దడి నివారణ: నీటి సరఫరా లోపం లేకుండా అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని, ఎంపీడీవోలు, ఎంపీఓలు, సెక్రెటరీలు కలిసి సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
✅ అభివృద్ధి పనుల సమీక్ష: నియోజకవర్గంలోని పలు అభివృద్ధి ప్రాజెక్టుల పురోగతిని పరిశీలించి, ప్రజలకు ఉపయోగకరమైన కార్యక్రమాలను వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.
పినపాక ఎమ్మెల్యే శ్రీ పాయం వెంకటేశ్వర్లు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని, అభివృద్ధి పనుల్లో జాప్యం లేకుండా అధికార యంత్రాంగం సమర్థవంతంగా పనిచేయాలని స్పష్టం చేశారు.