మంత్రాలయం నియోజకవర్గంలోని మాధవరం పరిధిలోని రచ్చుమర్రి గ్రామ సమీపంలో ఉన్న మోడల్ స్కూల్ బాలికల హాస్టల్లో సుంకేశ్వరి గ్రామానికి చెందిన 10వ తరగతి చదువుతున్న కురువ పార్వతి ఆత్మహత్యకు గల కారకులను గుర్తించి కఠినంగా శిక్షించాలని పెద్దకడబూర్ మండల వైసిపి EX ఎంపీపీ రఘురామడు డిమాండ్ చేశారు అదే విధంగా విలేకరులు సమావేశంలో ఆయన మాట్లాడుతూ విధ్యార్థిని ఆత్మహత్య చేసుకుందా లేక ఎవరైనా హత్యచేశారా అన్నకోణంలో అధికారులు విచారణ చేయాలన్నారు. విచారణలో దోషులుగా తేలినవారిని కఠినంగా శిక్షించాలన్నారు. అలాగే విద్యార్థి పార్వతి కుటుంబానికి 20 లక్షలు పరిహారం ఇవ్వాలని అదేవిధంగా కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
పార్వతి ఆత్మహత్యపై పూర్తి విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలి
RELATED ARTICLES