పశ్చిమ రాయలసీమ నియోజకవర్గ పట్టబద్రుల సమస్యల సాధనకు కృషి చేస్తానని పశ్చిమ రాయలసీమ నియోజకవర్గ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పిఎన్ బాబు హామీ ఇచ్చారు. శిరివెళ్ళ మండల కేంద్రంలోని మైనార్టీ పేటలో ఆయన ఆదివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అభ్యర్థి పిఎన్ బాబు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నిరుద్యోగుల సమస్యల కొరకు అనునిత్యం కృషి చేస్తానని నిరుద్యోగ భృతి సాధనకు శక్తివంచన లేకుండా అమలు చేసేందుకు ప్రయత్నిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో జాకీర్ హుస్సేన్,
హబ్బిబ్ బాషా,అబ్దుల్ సలీం
రబ్బానీ,రామ చంద్రుడు,
సముద్రాల జనార్ధన్ శెట్టి,
సత్యం, రామయ్య విశ్రాంత ఎం ఈ ఓలు మహబూబ్ భాష,రామ కృష్ణ, ఇతర ప్రముఖులు నిరుద్యోగులు పాల్గొన్నారు.
పశ్చిమ రాయలసీమ నియోజకవర్గ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పిఎన్ బాబు ఎన్నికల ప్రచారం
RELATED ARTICLES