భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
తేజ న్యూస్ టీవీ
4-010-2025
ములకలపల్లి మండలం జగన్నాథపురంలో శరన్నవరాత్రుల సందర్భంగా నిర్వహించిన దసరా వేడుకల్లో ఎమ్మెల్యే జారె ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పొగళ్ళపల్లిలో కాంగ్రెస్ నేత సాధం శ్రీనివాస్ పద్మ దంపతుల కుమార్తె ఆకాంక్ష నూతన వస్త్రాలంకరణ కార్యక్రమంలో పాల్గొని చిన్నారిని ఆశీర్వదించారు. చివరిగా దమ్మపేట మండలం పట్వారిగూడెంలో జరిగిన దసరా అన్నదాన కార్యక్రమంలో పాల్గొని పూజలు చేసి తీర్థ ప్రసాదం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ ప్రముఖులు, గ్రామ పెద్దలు, నాయకులు పాల్గొన్నారు.




