TEJA NEWS TV
పరకాల ఆర్టీసీ డిపో పరిధిలో కొత్తగా 7 ఎక్స్ప్రెస్ బస్సులను శుక్రవారం పరకాల పట్టణంలోని బస్ డిపోలో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా బస్ డిపో నుండి బస్సును స్వయంగా నడుపుతూ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి సందడి చేశారు. ఎమ్మెల్యే బస్ నడపడం చూసి స్థానికులు , కార్య కర్తలు ఆశ్చర్య పోయారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో అధికారంలోకి రాగానే రెండు పథకాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిందని,డిసెంబర్ 9న అసెంబ్లీ సమావేశం అనంతరం మహిళలకు ఉచిత బస్సు సదుపాయం కల్పించే మహాలక్ష్మి పథకాన్ని అమల్లోకి తెచ్చిందని అన్నారు.తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్సు సౌకర్యం కల్పించడంతో మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారని అన్నారు.
మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం వల్ల పెరిగిన రద్దీని దృష్టిలో పెట్టుకొని ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టాలని గత ప్రభుత్వం అనేక గ్రామాలలో బస్సు రూట్ లను తగ్గించడం వల్ల బస్ సౌకర్యం లేక ఇబ్బంది పడుతున్నామని బస్సు సౌకర్యం కల్పించాలని ప్రజలు చేసిన విజ్ఞప్తులను దృష్టిలో పెట్టుకొని తాను ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి టిఎస్ఆర్టిసి ఎండి సజ్జనార్ కి పరకాల నియోజకవర్గంలో బస్సుల సంఖ్యను పెంచాలని, కొత్తగా బస్సులను ఇవ్వాలని కోరడం జరిగిందని తన విజ్ఞప్తికి స్పందించి రాష్ట్ర ప్రభుత్వం పరకాల నియోజకవర్గ ప్రయాణికుల సౌకర్యార్థం 30 కొత్త బస్సులను ఇస్తూ ప్రస్తుతం 7 ఎక్స్ప్రెస్ బస్సులు వచ్చాయని వాటిని ప్రారంభించినట్లు త్వరలో మిగతా బస్సులు కూడా వస్తాయని అన్నారు ఈ కొత్త బస్సులు గ్రామీణ ప్రాంత ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని వాటిని సద్వినియోగపరుచుకోవాలని ఎమ్మెల్యే ప్రజలను కోరారు.
పరకాల: కొత్త ఆర్టీసీ బస్సులను ప్రారంభించిన పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి
RELATED ARTICLES