
తేజ న్యూస్ టివి ప్రతినిధి, సంగెం.
గ్రేటర్ వరంగల్ 16వ డివిజన్ ధర్మారం లో నిర్వహించిన పరకాల మాజీ శాసన సభ్యులు శ్రీ చల్లా ధర్మారెడ్డి గారి జన్మదిన వేడుకల్లో
స్థానిక 16వ డివిజన్ కార్పొరేటర్ సుంకరి మనీషా శివకుమార్ పాల్గొని కేక్ కట్ చేశారు. అలాగే సంగెం మండల కేంద్రంలో ఘనంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు మరియు అన్నదానం కార్యక్రమం నిర్వహించారు,
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చల్లా ధర్మారెడ్డి పరకాల అభివృద్ధి కోసం ఎమ్మెల్యే గా నిరంతరం కృషి చేశారని, వారి పట్టుదలతో మండలానికి కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కు వచ్చిందని, డివిజన్ వ్యాప్తంగా ధర్మారెడ్డి కృషితోనే అభివృద్ధి జరిగిందని, పరకాల ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ కష్ట సుఖాల్లో పాలుపంచుకుంటున్న చల్లా ధర్మారెడ్డి రాబోయే రోజుల్లో మళ్ళీ నియోజకవర్గ ఎమ్మెల్యేగా పరకాల ప్రజలకు సేవ చేస్తారని అన్నారు..
ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన నాయకులు నిమ్మగడ్డ, వెంకటేశ్వర్లు, మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పసునూరి సారంగపాణి , మాజీ జడ్పిటిసి గూడ సుదర్శన్ రెడ్డి, యూత్ మండల అధ్యక్షుడు పెండ్లి పురుషోత్తం రెడ్డి, మార్కెట్ డైరెక్టర్ గోలి.రాజయ్య,డివిజన్,గ్రామ అధ్యక్ష కార్యదర్శులు,బీ.ఆర్.ఎస్ పార్టీ నాయకులు, రమేష్, మాజీ సర్పంచులు, ఎంపిటిసిలు, జక్క మల్లయ్య, జీవన్ రెడ్డి , కార్యకర్తలు, యువత తదితరులు పాల్గొన్నారు.