భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
తేజ న్యూస్ టీవీ
రైతుల సంక్షేమమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారు – గ్రంథాలయ చైర్మన్ పసుపులేటి వీరబాబు
భద్రాద్రి కొత్తగూడెం : అక్టోబర్ 22:
ఈరోజు కొత్తగూడెం నియోజకవర్గం డేగల మడుగు కార్పొరేషన్ పరిధిలో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని కొత్తగూడెం ఎమ్మెల్యే కోనమ నేని సాంబశివరావు ప్రారంభించారు. రైతుల సమస్యలను అర్థం చేసుకుని, సరైన మద్దతు ధర కల్పిస్తూ ప్రభుత్వం రైతులకు అన్ని విధాలా అండగా నిలుస్తుందని ఆయన ఈ సందర్భంగా అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పసుపులేటి వీరబాబు, ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ, “తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతుల సంక్షేమాన్ని ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని అహర్నిశలు కృషి చేస్తున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో రైతులకు ప్రభుత్వం మద్దతుగా నిలుస్తోంది. ఇది నిజమైన రైతు ప్రభుత్వం,” అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, అధికారులు, పాత్రికేయులు, రైతులు పాల్గొన్నారు. పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభం ద్వారా డేగల మడుగు పరిసర గ్రామాల రైతులకు మార్కెట్ సౌకర్యం కలగనుందని గ్రామస్థులు తెలిపారు.
పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కోన మ నేని సాంబశివరావు
RELATED ARTICLES



