నంద్యాల జిల్లా చాగలమర్రి మండలం చిన్న వంగలి పెద్ద వంగలి గ్రామంలో మొన్న కురిసినటువంటి అకాల వర్షానికి బొప్పాయి అరటి చాలావరకు నష్టపోవడం జరిగింది….
చాగలమర్రి మండలంలో అరటి తోట 232 ఎకరాల్లో నాటడం జరిగింది బొప్పాయి 139 ఎకరాల్లో నాటడం జరిగింది పంట నష్టమైన రైతులకు త్వరలోనే నష్టపరి హారం వచ్చేలాగా చూస్తానని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ గారు తెలిపారు..
సంబంధిత అధికారులతో రెండు రోజుల్లో మీటింగ్ పెట్టుకుని ఆళ్లగడ్డ తాలూకాలో నష్టపోయిన ప్రతి ఒక రైతుకు అమౌంట్ వచ్చేలాగా చూస్తానని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ గారు తెలిపారు…
ఎక్కడైతే మన ఆళ్లగడ్డ తాలూకాలో బొప్పాయి సాగు చేస్తున్నారో అక్కడ ట్యూటీ ఫ్రూటీ మిషనరీ పెట్టడానికి ఎవరైనా రైతులు ముందుకు వస్తారో వారికీ ప్రభుత్వం నుంచి మేము సహాయం చేస్తామని అలాగే సబ్సిడీ ఇప్పిస్తామని గతంలో ఇచ్చిన లాగా రైతులకు ట్రాక్టర్లు ఇప్పిస్తామని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ గారు తెలిపారు..
కలెక్టర్ గారు ఔట్ అఫ్ లో ఉన్నారు రెండు రోజుల్లో అందుబాటులోకి వస్తారు కచ్చితంగా కలెక్టర్ గారితో మాట్లాడి నష్టపోయిన రైతులందరికీ న్యాయం చేసేలాగా చూస్తానని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ గారు తెలిపారు
పంట నష్టమైన రైతులకు త్వరలోనే నష్టపరిహారం వచ్చేలాగా చూస్తాం.. ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ
RELATED ARTICLES