TEJA NEWS TV
నంద్యాల జిల్లా
22-01-2025
*నంద్యాల జిల్లా పోలీసు అధికారులతో ఆంధ్రప్రదేశ్ డీజీపీ శ్రీ ద్వారకా తిరుమల రావు IPS గారు సమీక్ష నిర్వహించారు…..*
*నేరాల నియంత్రణలో జిల్లా పోలీసుల పనితీరును అభినందించిన డిజిపి గారు….*
*మున్ముందు మంరింత స్ఫూర్తితో పనిచేయండి…*
*జిల్లాలో శాంతిభద్రతల పరిస్థితిని డీజీపీకి వివరించిన ఎస్పీ గారు….*
నేడు ఆంధ్రప్రదేశ్ డీజీపీ శ్రీ ద్వారకా తిరుమలరావు గారు జిల్లా పోలీస్ కార్యాలయంలో కాన్ఫరెన్స్ హాల్లో అధికారులతో నేరాల పరిస్థితిపై సమీక్షా సమావేశం నిర్వహించారు.
➡️ముందుగా డీజీపీ శ్రీ ద్వారకా తిరుమలరావు IPS గారు నంద్యాల జిల్లా పోలీసు కార్యాలయానికి రాగానే కర్నూలు రేంజ్ DIG శ్రీ కోయ ప్రవీణ్ IPS గారు జిల్లా ఎస్పీ శ్రీ అధిరాజ్ సింగ్ రాణా IPS గారు పుస్ఫగుచ్చంతో స్వాగతం పలికారు.అనంతరం జిల్లా సాయుద బలగాలనుండి గౌరవ వందనం స్వీకరించారు.
➡️ అనంతరం సమీక్షా సమావేశంలో ముందుగా జిల్లా ఎస్పీ శ్రీ అదిరాజ్ సింగ్ రాణా IPS గారు నంద్యాల జిల్లాలో నేరాల నియంత్రణకు తీసుకున్న చర్యల గురించి డీజీపీ గారికి వివరించారు.
➡️ఈ సంధర్భంగా డీజీపీ గారు మాట్లాడుతూ వివిధ రకాల నేరాల నియంత్రణలో పోలీసు అధికారులు తీసుకున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయని,నేరాల నియంత్రణలో పోలీసు అదికారులు వారి సిబ్బంది కృషి అభినందనీయమని ప్రశంసించారు.
➡️రాష్ట్రవ్యాప్తంగా కూడా నేరాల సంఖ్య తగ్గిందన్నారు. ప్రస్తుతం నేరాలు అదుపులో ఉన్నాయన్నారు.ముఖ్యంగా పోలీస్ అధికారులు, సిబ్బంది సైబర్ నేరాలు,ముఖ్యమైన కేసుల దర్యాప్తులో సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించాలని, నేరాల నియంత్రణకు ఎప్పటికప్పుడు పకడ్బందీ చర్యలు తీసుకోవాలన్నారు.నిబద్ధతగా పనిచేసి జిల్లాలో శాంతిభద్రతలను పరిరక్షించాలని ఆదేశించారు.
➡️జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు ఆసాంఘిక శక్తులను అడ్డుకునేందుకు టెక్నాలజీని ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో డ్రోన్స్, సీసీ కెమెరాలు వాడుతున్నామన్నారు.నేరాలు జరిగే ప్రదేశాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం వలన నేరస్తులను కనుగొనడం జరుగుతుందని మరియు జిల్లాలో ఫింగర్ ప్రింట్ యూనిట్ బలోపేతం చేయడం ద్వారా వివిధ రకాల కేసులలో నేరస్తులను కనుగొని కేసులను ఛేదించడం జరిగిందని తెలియజేశారు.
➡️క్రైమ్ డిటెక్షన్ లో సిసి ఫుటేజ్ ఆధారాలు చాలా కీలకపాత్ర పోషిస్తాయని, వీటి కోసం రాష్ట్రంలో 18 వేల సిసి కేమరాలను ఏర్పాటు చేశామన్నారు. రాబోయే రోజుల్లో ఇంకా లక్ష కెమెరాలను ఏర్పాటు చేసుకునే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో డిజిపి గారితో పాటు కర్నూలు రేంజ్ DIG శ్రీ కోయ ప్రవీణ్ IPS గారు జిల్లా ఎస్పీ శ్రీ అధిరాజ్ సింగ్ రాణా IPS గారు, అడిషనల్ ఎస్పీ చంద్రబాబు గారు, నంద్యాల SDPO మంద జావళి ఆల్ఫోన్స్ IPS గారు, డీఎస్పీలు రవికుమార్,శ్రీనివాస్ జిల్లా ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు.
నేరాల నియంత్రణలో నంద్యాల జిల్లా పోలీసుల పనితీరును అభినందించిన డిజిపి ద్వారకా తిరుమల రావు
RELATED ARTICLES