TEJA NEWS TV HEADLINES
నేడు డిల్లీ నుండి యూరప్ పర్యటనకు సిఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ దంపతులు. 75వ పుట్టినరోజు వేడుకలు ముగించుకుని తిరిగి 21న రాష్ట్రానికి రాక
▪️ అమరావతికి 47 వేల కోట్లు అవసరం..ఏపీకి ప్రత్యేక గ్రాంట్లు, పన్నుల వాటా పెంచండి..16వ ఆర్థిక సంఘం ప్రతినిధులకు సీఎం చంద్రబాబు విజ్ఞప్తి. ఏపి పరిస్థితులపై సీఎం పవర్ పాయింట్ ప్రజెంటేషన్.
▪️డీఎస్సీ ఆన్ లైన్ దరఖాస్తులు ఏ, బి పార్టులుగా విభజన. పార్ట్ – ఏ లో పాఠశాల కేటగిరీ (ప్రభుత్వ, మున్సిపల్, పంచాయితీ, ఏపీఅర్జేసి) ఆప్షన్ ఎంచుకోవాలి. పార్ట్ – బి లో సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి.
▪️ఈనెల 29న రాష్ట్రం నుంచి హజ్ యాత్ర ప్రారంభం. ఈ ఏడాది 1630 మంది ప్రయాణికులకు అవకాశం.
▪️ప్రైవేట్ పాఠశాలల్లో విద్యా హక్కు చట్టం ప్రకారం 25% ఉచిత ప్రవేశాలకు ఈనెల 28 నుంచి మే 15 వరకు దరఖాస్తులు ఆన్ లైన్లో స్వీకరించనున్నారు. లాటరీ ద్వారా సీట్లు కేటాయించనున్నారు.
▪️రాష్ట్రంలో ఎటువంటి ఉపాధి లేనివారు 1.56 కోట్ల మంది ఉన్నారు. సచివాలయాలు నిర్వహించిన ఇంటింటి సర్వేలో వెల్లడి.
▪️రైల్లోనే ఏటీఎం సేవలు. తొలిప్రయత్నంగా ముంబయి మన్మాడ్ పంచవటి ఎక్స్ ప్రెస్ లో ట్రయల్ రన్ విజయవంతం. త్వరలో మిగతా రైళ్లకు విస్తరణ.
▪️వెబ్ సైట్ లో అందుబాటులో ఉన్న ఇంటర్ ప్రథమ, ద్వితీయ సం. షార్ట్ మెమో మార్కుల జాబితాలు.
▪️రికార్డు స్థాయికి వెళ్లిన బంగారం ధర. 10 గ్రా. 98,400.
▪️తదుపరి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా బిఆర్ గవాయ్ పేరు సిఫార్సు చేసిన ప్రస్తుత చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా. మే 14న ప్రమాణ స్వీకారం.