TEJA NEWS TV Giddalur:
ప్రకాశం జిల్లా, గిద్దలూరు టిడిపి ఇన్చార్జ్ శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారిని రాచర్ల యువకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మండల తెలుగు యువత అధ్యక్షులు సొంటం కళ్యాణ్ రెడ్డి యువకులకు క్రికెట్ కిట్టు ను బహుకరించారు. ఈ క్రికెట్ కిట్టును అశోక్ రెడ్డి గారి చేతుల మీదగా యువకులకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేటి యువత క్రీడల్లో రాణించాలని క్రీడలు మానసిక ఉల్లాసానికి శరీర దారుడ్యానికి ఎంతగానో ఉపయోగపడతాయని తెలియజేశారు.