ఎన్.టి.ఆర్. జిల్లా పోలీస్ కమిషనర్ వారి కార్యాలయము, విజయవాడ.
హైదరాబాదు నుండి శ్రీకాకుళం వెళుతున్న కావేరి ట్రావెల్స్ బస్సు నిన్న అనగా ది.17.11.2025 తేదిన రాత్రి సమయంలో ఎన్.టి.ఆర్. జిల్లా నందిగామ టౌన్ అనసాగారం ఫ్లై ఓవర్ పైన షుగర్ లోడ్ తో వెళుతున్న లారీని ఓవర్ టెక్ చేయబోయిన క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 23 మంది ప్రయాణికులు ఉన్నారు.
ప్రమాదం జరిగిన వెంటనే స్థానిక పోలీస్ వారు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టి గాయపడిన వారిని హాస్పిటల్ నందు చేర్చడం జరిగింది. ఈ ప్రమాదంలో మొత్తం 8 మంది గాయపడినారు. వీరిలో 05 మంది చిన్న చిన్న గాయాలతో చికిత్స తీసుకున్న అనంతరం వెళ్ళిపోయినారు. మిగిలిన ముగ్గురిలో ఇద్దరికీ హెయిర్ లైన్ ఫ్యాక్చర్స్ అయినాయి మరొక మహిళకు కాలు విరిగినది వీరిని తదుపరి చికిత్స నిమిత్తం విజయవాడ ఆసుపత్రికి రిఫర్ చేయడం జరిగింది.
ప్రమాదం జరిగిన ప్రదేశంలో ట్రాఫిక్ అంతరాయం లేకుండా నేషనల్ హైవే అధారిటి వారి సహాయంతో క్రేన్ తీసుకువచ్చి వాహనాలను తొలగించి ట్రాఫిక్ క్లియర్ చేయడం జరిగింది. ఆ బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా ప్రత్యామ్నాయ బస్సులలో వారి గమ్యస్థానాలకు పంపడం జరిగింది.
ప్రతి రోజూ రాత్రి సమయాలలో రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి తెల్లవారు జామున అనగా 2 గంటల నుండి 5 గంటల ప్రాంతాలలో రహదారులపై పోలీసు అధికారులు వాహనదారులకు స్టాప్, వాష్, రిఫ్రెష్ అండ్ గో కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది.
ఆర్.టి.ఓ. అధికారులతో కలిసి ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని పరిశీలించి ప్రమాదానికి గల కారణాలను తెలుసుకోవడం జరుగుతుంది. రోడ్డు ప్రమాదంపై లోతైన దర్యాప్తు చేయడం జరుగుతుంది. ప్రమాదం జగిరిన వెంటనే బస్సు డ్రైవర్ పారిపొయినాడు, కావేరి ట్రావెల్స్ యాజమాన్యం వారికి సమాచారం అందించడం జరిగింది. దర్యాప్తు అనంతరం బాధ్యులపైన చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
ప్రమాదవశాత్తూ మరణాలకు సంబందిచిన రోడ్డు ప్రమాదాలు ఈ రోజుకు గత సంవత్సరం 420 రోడ్డు ప్రమాద మరణాలు (Accidental Deaths) జరిగితే ఈ సంవత్సరం 328 రోడ్డు ప్రమాద మరణాలు (Accidental Deaths) జరిగినాయి. గత సంవత్సరంతో పోలిస్తే ఈ రోజుకు 92 మరణాలను తగ్గించగలిగాము.
ఎన్.టి.ఆర్. పోలీస్ కమీషనరేట్ పరిధిలో రోడ్డు ప్రమాదాలు జరుగు బ్లాక్ స్పాట్ లను గుర్తించి ఆ ప్రదేశాలలో తగిన చర్యలు తీసుకోవడం జరిగింది. ఇబ్రహీంపట్నం, నందిగామ మొదలైన ప్రదేశాలలో ట్రాఫిక్ బ్లింకర్స్ లను, రంబుల్ స్టిక్స్ లను ఏర్పాటు చేయడం జరిగింది. రహదారులపై వెలుతురు సరిగా లేని ప్రదేశాలను గుర్తించి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా సంబందిత అధికారులకు తెలియజేయడం జరిగింది.
ఈ క్రమంలో ఇటువంటి ప్రమాదాలు జరుగకుండా జరుగకుండా తగిన పటిష్టమైన జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుందని పోలీస్ కమీషనర్ శ్రీ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్.గారు పత్రికా ప్రకటన ద్వారా తెలియజేశారు.
***
నిన్న రాత్రి అనాసాగారం వద్ద జరిగిన రోడ్డు ప్రమాద వివరాలు
RELATED ARTICLES



