కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండలం మందాపూర్ గ్రామంలో కలెక్టర్ జితేష్ వి పాటిల్ గారి సూచన మేరకు వైద్యశాఖ ఆధ్వర్యంలో చావిడి వద్ద ఏర్పాటు చేసిన పోలియో చుక్కల కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా వైస్ చైర్మన్ అంకన్నగారి నాగరాజ్ గౌడ్ పాల్గొని 05 సంవత్సరాల లోపు పిల్లలకు పోలియో చుక్కలు వేయడం జరిగింది ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ పిల్లలకు వచ్చే అనేక వ్యాధుల్లో పోలియో ఒకటని ఇది వస్తే, పిల్లల్లో వ్యాధి నిరోధక శక్తి తగ్గి, కాళ్లు, చేతులూ వంకర అవుతాయన్నారు.కొన్ని కేసుల్లో మెదడుకి కూడా వ్యాపిస్తోందని ఇలా అవయవాలకు కూడా వైకల్యం సంభవిస్తుందన్నారు. ఇది అంటువ్యాధి కాదని దీన్ని రాకుండా అడ్డుకోవడానికి ఏకైక మార్గం పోలియో చుక్కలని అదే చుక్కల మందని అన్నారు పోలియో మహమ్మారి నుంచి కాపాడేందుకు ఈ మందును పుట్టిన పిల్లల నుంచి 5 ఏళ్ల వయసు లోపు పిల్లలకు ప్రభుత్వమే ఏటా ఒక రోజు ఉచితంగా వేస్తుందన్నారు అనంతరం రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో పోలియో చుక్కల కార్యక్రమంలో విధులు నిర్వర్తిస్తున్న వైద్య సిబ్బందికి, అంగన్ వాడి, ఐకేపీ సిబ్బంది, ఆశా వర్కర్లకు బిస్కెట్లు (స్నాక్స్) అందించారు ఈ కార్యక్రమంలో డివిజన్ రెడ్ క్రాస్ మెంబర్, హెల్త్ అసిస్టెంట్ వినోద్ కుమార్,MLHP సుజాత, ఏఎన్ఎం లక్ష్మి, గోదావరి, శోభ,సురేఖ,స్వామీ, వెంకటలక్ష్మి, మంజుల బుజ్జమ్మ పాల్గొన్నారు
నిండు జీవితానికి రెండు చుక్కలు -రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా వైస్ చైర్మన్ నాగరాజ్ గౌడ్
RELATED ARTICLES