నిండు గర్భిణీ కు కొన ఊపిరితో ఉన్న శ్రీదేవి కు రక్తదానం చేసిన MRPS మండల అధ్యక్షులు పంచాగుండిగ వెంకటేష్
మానవసేవయే మాధవసేవ… పరోపకారానికి మించిన మంచి గుణం లేదు అంటూ ఒక మనిషి చేసే సహాయాన్ని తెలుసుకొని గుర్తిస్తారు అయితే ఆపదలో ఉన్నవారికి అవసరంలో ఉన్నవారికి ఆపన హస్తం అందిస్తే వారు తమ జీవితంలో తమ పొందిన సహాయాన్ని చివరి వరకు గుర్తుంచుకుంటారు. ఎంతో విలువైన మనిషి ప్రాణాలను కాపాడేందుకు సహాయం చేస్తే వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటారు. ఈ క్రమంలోనే హోలగుంద మండలం ఎం ఆర్ పి ఎస్ అధ్యక్షులు వెంకటేష్ మాదిగ రక్తదానం చేసి ఒక నిండు గర్భిణీ ప్రసవానికి సహాయం చేయడంతో పాటు ప్రాణాపాయం జరగకుండా ఆదుకున్నాడు.జాలిమంచి గ్రామానికి చెందిన నిండు గర్భిణి శ్రీదేవి పురిటి నొప్పులతో ఆదోని పట్టణంలోని గోష ఆస్పత్రిలో ప్రసవం కోసం అడ్మిట్ అయింది. అయితే ఆ యువతికి రక్తం తక్కువగా ఉండడంతో కాన్పు కష్టమని వైద్యాధికారులు తెలియజేశారు అంతేకాక ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నట్లు తెలియజేయడంతో ఆ గర్భిణీ బంధువులు కావలసిన రక్తం కోసం ప్రయత్నించారు. ఈ పరిస్థితులలో తన మిత్రుడు మంజు ద్వారా ఒక గర్భిణీ స్త్రీ కి రక్తం అవసరం అన్న విషయం తెలుసుకున్న హోలగుంద మండల ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు వెంకటేష్ మాదిగ స్వచ్ఛందంగా ఆదోని పట్టణానికి వెళ్లి ఆ గర్భిణీ స్త్రీ కి అవసరమైనటువంటి రక్తాన్ని ఆదోని ఏరియా ఆసుపత్రిలో డాక్టర్లకు అందించారు. స్వచ్ఛందంగా ఒక గర్భిణీ స్త్రీ ప్రాణాలను కాపాడడం కోసం పసవానికి సహాయం చేయడం కోసం ముందుకు వచ్చి రక్తదానం చేసిన ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు వెంకటేష్ మాదిగను ఆ యువతి కుటుంబ సభ్యులు కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు.
నిండు గర్భిణీ కి రక్తదానం చేసిన MRPS మండల అధ్యక్షులు వెంకటేష్
RELATED ARTICLES