Monday, January 12, 2026

నారా లోకేష్ ని కలిసిన TNSF ఆదోని నియోజకవర్గ అద్యక్షులు బెస్త జయ సూర్య

TEJA NEWS TV : యువ నాయకులు నారా లోకేష్ గారితో ఆదోని నియోజక వర్గ TNSF అద్యక్షులు జయ సూర్య గారు మాట్లాడుతూ గతంలో టీడీపీ అధికారం ఉన్న సమయంలో ఆదోని ప్రాంతంలో ఉన్న విద్యార్థుల కోసం ఆదోని నియోజక వర్గ ఇంఛార్జి మీనాక్షి నాయుడు గారు ఆదోని లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల కోరగా 2018 లో GO నెం MS19 ద్వారా ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంజూరు చేయించారు.అపట్టి ప్రతి పక్ష నేత జగన్ మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తూ ఆదోని ఏరియా ఆసుపత్రి నందు వైకాపా పార్టీ నీ గెలిపిస్తే డిగ్రీ కళాశాల పనులు వేగవంతంగా పూర్తి చేస్తానని హామీ ఇచ్చి విద్యార్థుల ఓట్ల ను దండుకొని నాలుగేళ్లు కాలయాపన చేసి మరల జీవో ఇస్తున్న అని కల్లబొల్లి మాటలు చెప్తు విద్యార్థులను నయవంచన చేశారన్నారు.ఈ వైకాపా ప్రభుత్వానికి విద్యార్థులంతా ఏకమై బుద్ది చేపుతామని తెలియజేశారు.తెలుగు దేశం పార్టీ అధికారం లో వస్తే విద్యార్థుల కు న్యాయం చేయాలని ఆదోని లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు అయ్యే విధంగా సత్వర చర్యలు అధికారం లో రాగానే చేపట్టాలని కోరడం జరిగింది. నాకు ఈ అవకాశాన్ని కల్పించిన TNSF కర్నూలు జిల్లా అధ్యక్షులు రామాంజినేయులు ఆన్న గారికి నన్ను ప్రోత్సహిస్తున్న ఆదోని ఇంఛార్జి మీనాక్షి నాయుడు గారి కి ఉమాపతి నాయుడు గారికి భూపాల్ చౌదరి గారి కి సిద్దార్థ నాయుడు గారికి అన్నయ్య మారుతి నాయుడు గారి కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అని అన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular