
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
తేజ న్యూస్ టీవీ
కొత్తగూడెం, అక్టోబర్ 28.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయి బ్రాహ్మణ సేవా సంఘం (500/82) ఆధ్వర్యంలో జరిగిన జిల్లా మహాసభ కొత్తగూడెం శేషగిరి భవన్, ఏఐటీయూసీ కార్యాలయంలో ఘనంగా జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కొత్తగూడెం శాసనసభ్యులు, సీపీఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, జిల్లా కార్యదర్శి ఎస్‌కే సాబీర్ పాషా, రాష్ట్ర ఉపాధ్యక్షులు తూముల శ్రీనివాస్ తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కూనంనేని మాట్లాడుతూ, నాయి బ్రాహ్మణ వృత్తిదారుల సంక్షేమం కోసం నాయి బ్రాహ్మణ భవన నిర్మాణం నిమిత్తం తన ఎమ్మెల్యే నిధి నుండి ₹25 లక్షల రూపాయలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.
చేతివృత్తుల అభివృద్ధికి ఎల్లప్పుడూ అండగా ఉంటానని, సీపీఐ పార్టీ ప్రజల పక్షాన నిలబడి వృత్తిదారుల హక్కుల కోసం నిరంతరం పోరాడుతుందని ఆయన స్పష్టం చేశారు.
జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా మాట్లాడుతూ, కార్పొరేట్ సెలూన్లు సాధారణ నాయి బ్రాహ్మణ వృత్తిదారులపై ఆర్థిక ఒత్తిడి పెంచుతున్నాయని, ఈ విధానాన్ని అడ్డుకునే బాధ్యత ప్రతి వృత్తిదారిపై ఉందన్నారు. కమ్యూనిస్టు పార్టీగా తమ అండ ఎల్లప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు.
రాష్ట్ర ఉపాధ్యక్షులు తూముల శ్రీనివాస్ మాట్లాడుతూ, నాయి బ్రాహ్మణుల వృత్తి రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసి, చైర్మన్, జిల్లా డైరెక్టర్ల నియామకం చేయాలని, ₹200 కోట్ల సంక్షేమ నిధి కేటాయించాలని డిమాండ్ చేశారు. అలాగే, సలోన్లపై విద్యుత్ శాఖ అనవసర దాడులు ఆపాలని, 250 యూనిట్ల కరెంట్ బిల్లుల పెండింగ్ కారణంగా వృత్తిదారులను వేధించరాదని ఆయన సూచించారు.
ఈ మహాసభలో కొత్తగా ఎన్నికైన జిల్లా నాయి బ్రాహ్మణ సేవా సంఘం కమిటీ ఇలా ఉంది:
జిల్లా అధ్యక్షుడు: తూముల సదానందం
ప్రధాన కార్యదర్శి: రాచకొండ నాగేశ్వరరావు
వర్కింగ్ ప్రెసిడెంట్: గోరంట్ల వెంకటేశ్వరరావు, ముత్యాల లక్ష్మణ్
కోశాధికారి: సోములపల్లి బాలకృష్ణ
గౌరవ అధ్యక్షులు: తూముల శ్రీనివాస్, కొమరవెల్లి రవీందర్, మల్లెల నరసింహారావు, కురిమిళ్ళ దుర్గయ్య
గౌరవ సలహాదారులు: కొలిపాక వెంకటేశ్వరరావు, చందర్లపాటి మణికుమార్ రావు, ఉబ్బనపల్లి వెంకటేశ్వరరావు, కురిమిళ్ళ వెంకన్న, ఉరిమిళ్ళ శంకర్
జిల్లా ప్రతినిధి: సోములపల్లి వెంకటేశ్వర్లు (ఎస్‌వి)
ఉపాధ్యక్షులు: మంతెన శాంతారావు, జంపాల వెంకన్న, కురిమిళ్ళ రవికుమార్, అవుదుర్తి రాజేష్
సహాయ కార్యదర్శులు: శేషాద్రి వినోద్, అవుదుర్తి వెంకటరావు, శ్రీరాముల ఉదయకుమార్, మంతెన శ్రీనివాస్, దేవరకొండ శ్రీనివాస్
ప్రచార కార్యదర్శులు: కొత్తగట్టు రమేష్, సంఘపు భీమ్‌రాజ్, కుదురుపాక రమేష్, ముత్యాల వేణు, మాదాసు సత్యనారాయణ, చంద్రగిరి మురళి
ఈ ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి.
మహాసభలో జిల్లా నాయి బ్రాహ్మణ సంఘ నాయకులు, వృత్తిదారులు భారీగా హాజరయ్యారు.



