TEJA NEWS TV : కోసిగి మండలంలో నష్టపోయిన మిరప రైతులకు ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం అందించి ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కే వెంకటేశ్వర్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు శనివారం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కోసిగి మండల కమిటీ ఆధ్వర్యంలో కోసిగి లో మిరప పంట పొలాలను పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు మిరప పంట సాగు చేయడానికి లక్షలాది రూపాయలు అప్పు చేసి ఖర్చు చేసి సాగు చేశారనిఖరీఫ్ లో కురిసిన అధిక వర్షాలు వల్ల మిరప పంటకు తెగుళ్లుసోకి మిరప పంట ఎదుగుదల లేక దిగుబడి రాక రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆయన అన్నారు మిరప పంట ఎకరాకు 20 నుండి 25 క్వింటాల్ల్స్ రావాల్సి ఉండగా కేవలం రెండు మూడు క్వింటాళ్లు మాత్రమే వస్తుందని ఆయన అన్నారు దీనివల్ల రైతులు పంట కోసం పెట్టిన పెట్టుబడి కూడా రావడంలేదని అప్పులు పెరిగిపోయి తీర్చే మార్గం కానరాక రైతులు వలసలు పోతున్నారని ఆయన అన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మిరప పంటను పరిశీలించి నష్టపోయిన రైతులకు ఎకరాకు లక్ష రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని అదేవిధంగా ఉల్లి పత్తి రైతులకు ఎకరాకు 50 వేల రూపాయలు నష్టపరిహారం అందించి వలసల్ని నివారించాలని లేనిపక్షంలో రైతులను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని ఆయన హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కోసిగి మండల అధ్యక్ష కార్యదర్శులు పూజారి శ్రీనివాసులు వీరేష్ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు ఆదెప్ప సిఐటియు మండల కార్యదర్శి రాముడు రైతులు పెద్ద ముకప్ప రాము కలందర్ తదితరులు పాల్గొనడం జరిగింది
నష్టపోయిన మిరప రైతులను ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర్లు డిమాండ్
RELATED ARTICLES