Thursday, November 20, 2025

నవంబర్ 28న సూర్యాపేటలో జరిగే
గీతన్నల రణభేరి జయప్రదం చేయండి పోస్టర్ కరపత్రాలు ఆవిష్కరణ

TEJANEWSTV TELANGANA

నవంబర్ 28న సూర్యాపేటలో జరిగే గీతన్నల రణభేరి జయప్రదం చేయండి పోస్టర్ కరపత్రాలు ఆవిష్కరణ.
వేలాదిమంది గీత కార్మికులు తరలిరావాలని KGKS కల్లు గీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షలు సైదగౌని వెంకట్ గౌడ్  పిలువు.
*****
కల్లుగీత కార్మిక సంఘం తెలంగాణ రాష్ట్ర 4 వ మహాసభల సందర్భంగా నవంబర్
*28వ తేదీన సూర్యాపేటలో భారీ ప్రదర్శన, బహిరంగ సభ నిర్వహిస్తున్నామని దీనికి రాష్ట్ర నలుమూలల నుండి వస్తున్నారు జిల్లా లో గౌడ గీత కార్మికులు వేలాదిగా తరలిరావాలని కల్లుగీత కార్మిక
సంఘం జిల్లా అధ్యక్షులు  సైదగౌని వెంకట్ గౌడ్ పిలుపునిచ్చారు
. ఈరోజు బీబీపేట్ మండల కేంద్రము లో  పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వెంకట్ గౌడ్  మాట్లాడుతూ నవంబర్ 28 న బహిరంగ సభ అనంతరం 29,30 తేదీలలో జరిగే ప్రతినిధుల మహాసభలో రాష్ట్రంలోని గీత కార్మికుల సమస్యలు చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామన్నారు.
1957లో రాష్ట్రంలో మొట్టమొదట ఏర్పడ్డ సంఘం కల్లుగీత కార్మిక సంఘం. ఈ 68 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో అనేక పోరాటాలు, ఉద్యమాలు నిర్వహించాం. సొసైటీలు, టిఎఫ్ టి లు, పెన్షన్, ఎక్సిగ్రేషియా లాంటి కొన్ని హక్కులు సాధించుకున్నాము. మరెన్నో సాధించుకోవాల్సి ఉందన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో 5 లక్షల కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్న కల్లుగీత వృత్తి గురించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పట్టింపే లేదు. కేంద్ర బిజెపి ప్రభుత్వం గీత కార్మికుల  సంక్షేమానికి ఒక్క పథకం కూడా పెట్టలేదు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయలేదు. అధికారులకు, మంత్రులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేదన్నారు. ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ 4 వేలకు, ఎక్సిగ్రేషియా 10 లక్షలకు పెంచాలని, ప్రమాద నివారణకు వృత్తి చేసే వారందరికీ జాప్యం లేకుండా కాటమయ్య రక్షణ కవచం ఇవ్వాలని, ప్రమాదానికి గురైన గీత కార్మికులకు ఇవ్వాల్సిన పెండింగ్ ఎక్సిగ్రేషియా వెంటనే విడుదల చేయాలని, నీరా మరియు తాటి ఈత ఉత్పత్తుల పరిశ్రమలు ఏర్పాటు చేయాలని కల్తీ కల్లు పేరిట అక్రమ దాడులు ఆపాలని దరఖాస్తు చేసుకున్న వారందరికీ సోసైటిలు,TFT లైసెన్స్ లు వెంటనే ఇవ్వాలని ప్రతి గ్రామానికి చేట్లు పెంచుకోవడానికి 5 ఎకరాల భూమి ఇవ్వాలని తదితర  డిమాండ్ల పరిష్కారం కోసం ఉద్యమిస్తామన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో కల్లు గీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు వెంకట్ గౌడ్ ప్రధాన కార్యదర్శి రాజా గౌడ్ బీబీ పెట్ నాయకులు స్వామి గౌడ్, రమేష్ గౌడ్ పరుశురాం గౌడ్, శ్రీనివాస్ గౌడ్,అంజాగౌడ్, సతీష్ గౌడ్, తిరుపతి గౌడ్, శ్రీనివాస్ గౌడ్, రవి గౌడ్ తదితరులుపాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular