Sunday, January 11, 2026

నకిలీ విత్తనాలు విక్రయిస్తే పిడి యాక్ట్ నమోదు చేస్తాం – -డీఎస్పీ అబ్దుల్ రెహ్మాన్

తేజ న్యూస్ టీవీ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
మండలం. చండ్రుగొండ
సెంటర్. గానుగపాడు


– విత్తనానికి చాలా విలువ ఉంది డీలర్లు విత్తన చట్టానికి లోబడి విత్తనాలు అమ్మాలి.
– వ్యవసాయానికి విత్తనం ప్రాణం లాంటిది.
– రైతులు నకిలీ విత్తనాల పట్ల అప్రమత్తంగా ఉండాలి.
యాంకర్ పార్ట్. చండ్రుగొండ మండలం గానుగపాడు గ్రామంలో చండ్రుగొండ అన్నపురెడ్డిపల్లి మండలాల ఫెర్టిలైజర్ డీలర్లకు వ్యవసాయ శాఖ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి కొత్తగూడెం డిఎస్పి అబ్దుల్ రహమాన్, హాజరైనారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విత్తనాలు పురుగు మందులు వికరించే డీలర్లకు హెచ్చరికలు జారీ చేశారు .అనంతరం అశ్వరావుపేట వ్యవసాయ సంచాలకులు అఫ్జల్ బేగం మాట్లాడుతూ విత్తనం ప్రాణం లాంటిది కాబట్టి ఎంతో కష్టపడి వ్యవసాయం చేస్తుంటారు . రైతులు బిల్లు లేకుండా విత్తనాలు కానీ పురుగు మందులు గాని కొనుగోలు చేయవద్దని తెలిపారు. ఈ కార్యక్రమంలో జూలూరుపాడు సిఐ వసంత కుమార్, చండ్రుగొండ సబ్ ఇన్స్పెక్టర్ గొల్లపల్లి విజయలక్ష్మి, అన్నప్పరెడ్డిపల్లి సబ్ ఇన్స్పెక్టర్ సయ్యద్ షాహినా, వ్యవసాయ అధికారి వినయ్ వ్యవసాయ విస్తరణ అధికారి విజయ్ భాను, శ్రీనివాస్ ఫెర్టిలైజర్ డీలర్లు రైతులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular