TEJA NEWS TV : నంద్యాల:(బొమ్మల సత్రం) నంద్యాల జిల్లా స్థానిక బొమ్మల సత్రం పరిధిలో మాల స్మశాన కార్మికుల సంక్షేమ సంఘం నూతన కార్యాలయాన్ని రాష్ట్ర అధ్యక్షులు, జిల్లా, మండల అధ్యక్షులతో సోమవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాలకు చెందినవారు గ్రామాలలో పట్టణాలలో ఎట్టి మాలలు అని ఉన్నారని, మనకు చాలా గ్రామాలలో స్మశానమునకు స్థలం లేక వెళ్లే దారులు సరిగా లేవని అలాగే పిల్లలు పై చదువులు చదువుటకు ఉద్యోగం పొందుటకు ప్రత్యేక రిజర్వేషన్ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని Sc కార్పొరేషన్ ద్వారా భూమిలేని వారికి భూమి కొనుగోలు చేసి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
గౌరవేతనం 5000 రూపాయలు తక్షణమే ఇవ్వాలని అలాగే రెండు ఎకరాల స్థలం మాల స్మశాన కార్మికుల సంక్షేమం ఒక భవనం ఏర్పాటు చేయాలని ఎట్టి మాలలకు ప్రభుత్వం వారు పెన్షన్లు ఇవ్వాలని మాల స్మశాన కార్మికుల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేశారు..
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సల్మాన్, రాష్ట్ర నాయకులు ఏసోబు, సత్యనారాయణ, బాల మద్దయ్య, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు ,ఉపాధ్యక్షురాలు మహిళలు, కార్మికులు తదితరులు భారీగా పాల్గొన్నారు
నంద్యాల: మాల స్మశాన కార్మికుల సంక్షేమ సంఘం నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన రాష్ట్ర అధ్యక్షుడు గోసుల ఇషాక్
RELATED ARTICLES