Saturday, April 26, 2025

నంద్యాల జిల్లా వ్యాప్తంగా లాడ్జిల తనిఖీలు

TEJA NEWS TV : నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ అధిరాజ్ సింగ్ రాణా IPS గారి ఆదేశాలమేరకు శనివారం రాత్రి నంద్యాల జిల్లాలోని నాలుగు సబ్ డివిజన్ లలో పోలీస్ అధికారులు తనిఖీలు నిర్వహించడం జరిగింది.

👉ఈ సందర్భంగా లాడ్జిలలో బస చేసిన వారి వివరాలు రిజిస్టర్ ఆధారంగా పోలీస్ అధికారులు ప్రతి గదిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు.

👉లాడ్జిల పరిసరాలు తప్పనిసరిగా కనిపించేలా వాటి యజమానులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి.

👉లాడ్జిలకు వచ్చేవారి వివరాలు ప్రభుత్వ ఆధారిత ధ్రువపత్రాల ఆధారంగా సంబంధిత రిజిస్టర్లలో నమోదు చేసుకోవాలి.

👉లాడ్జిలలో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న అనుమానం ఉంటే వెంటనే సంబంధిత పోలీసు అధికారులకు తెలియజేయాలి


👉లాడ్జిలలో ఎలాంటి అసాంఘిక మరియు చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరగకుండా యజమానులు తగు చర్యలు తీసుకోవాలని లాడ్జి నిర్వాహకులకు పోలీస్ అధికారులు తెలియజేశారు.


👉ఈ తనిఖీలలో అనుమానం ఉన్న వారి వ్యక్తుల వివరాలను నమోదు చేసుకోవడంతో పాటు క్షుణ్ణంగా వారిని విచారించడం జరిగింది.

జిల్లా పోలీస్ కార్యాలయం నంద్యాల

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular