TEJA NEWS TV : నంద్యాల జిల్లా నూతన కలెక్టర్ గా ఇటీవలే పదవి భాద్యతలు తీసుకున్న జిల్లా సర్వోన్నత అధికారి రాజకుమారిని శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో ఆళ్ళగడ్డ శాసనసభ సభ్యురాలు శ్రీమతిభూమా అఖిల ప్రియ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తొలిసారిగా ఒక మహిళా కలెక్టర్ నంద్యాల జిల్లాకు రావడం తమకు ఎంతో ఆనందంగా ఉందని కొనియాడారు. ఈ సందర్భంగా ఆమె నియోజకవర్గంలో ఉన్న పలు సమస్యలను కలెక్టర్ రాజకుమారి దృష్టికి తీసుకుని వెళ్లారు. స్పందించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆళ్లగడ్డ నియోజకవర్గసమస్యలను పరిష్కరించేందుకు తమ వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ కు హామీ ఇచ్చారు.
నంద్యాల కలెక్టర్ ను కలిసిన ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ
RELATED ARTICLES