నంద్యాల : రైతునగరంలో కోట్లు విలువైన స్థల వివాదం
ప్రముఖ వైద్యుడు మధుసూదన్ రావు టార్గెట్?
నంద్యాల జిల్లా రైతునగరంలోని కోట్ల విలువైన 7.39 ఎకరాల స్థలం చుట్టూ ఉద్రిక్తతలు మళ్లీ రగిలాయి. ప్రముఖ వైద్యుడు డా. మధుసూదన్ రావు పై కుట్రకోణంలో దాడులు జరుగుతున్నాయన్న ఆరోపణలు చర్చనీయాంశంగా మారాయి.
ఈ స్థలానికి సంబంధించి గతంలోనే ఆర్ఓఆర్ కేసులో తహశీల్దార్ “కత్తి శ్రావణిరెడ్డి కి హక్కు లేదు” అని ఉత్తర్వులు జారీ చేసినా… శాంతిభద్రతలకు ముప్పుగా మారేలా పరిస్థితులు దిగజారుతున్నాయి. మధుసూదన్ రావు, తోట కుటుంబాలు కొనుగోలు చేసిన స్థలంపై వేణుగోపాల్ రెడ్డి, శ్రావణిరెడ్డి, హరిబాబు తదితరుల పేర్లు వివాదాల్లో బయటపడుతున్నాయి.
ఇటీవల కత్తి శ్రావణిరెడ్డి ఏర్పాటు చేసిన మీడియా సమావేశం, కోర్టులో నడుస్తున్న పరస్పర దావాలు, స్థల చుట్టూ ఏర్పాటు చేసిన కంచెపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా, డా. మధుసూదన్ రావును ఉద్దేశపూర్వకంగా ఈ స్థలానికి రప్పించి క్రిమినల్ కేసులు నమోదు చేయాలని వ్యూహం పన్నుతున్నారన్న ఆరోపణలు తీవ్రంగానే మారాయి.
ఈ స్థల వివాదం ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో అన్న దానిపై నంద్యాల ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది.
నంద్యాలలో కోట్లు విలువైన స్థల వివాదం
RELATED ARTICLES