TEJA NEWS TV
నందిగామ పట్టణం గాంధీ సెంటర్ నందు ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ పై అవగాహన కార్యక్రమం. ఏ.సి.పి.,ఏ.బీ.జీ.తిలక్ , సర్కిల్ ఇన్స్పెక్టర్ మిస్టర్. వై.వి.వి.ఎల్. నాయుడు, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఎన్ నరేష్ వారి సిబ్బంది ఆధ్వర్యంలో ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ ధరించడం గురించి అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది.
హెల్మెట్ ధరించడం అనేది మీ యొక్క వ్యక్తిగత భద్రత కోసమేనని, దీనిని అలుసుగా, ఆసరాగా తీసుకోకుండా సీరియస్ గా హెల్మెట్ ధరించాలని తెలిపారు. మీరు హెల్మెట్ ధరించ పోతే 1000/- రూపాయలు ఫైన్ లే వెయ్యాలి అనుకుంటే, గవర్నమెంట్ కి రోజుకి 50 వేల రూపాయలు ఆదాయం చేకూర్చగలమని. ఒకసారి చెప్పటం, రెండుసార్లు చెప్పటం, మూడవసారి జైలుకే పంపిస్తామని తదుపరి వాహనాన్ని సీజింగ్ చేయగలమని హెచ్చరించారు. అలా చేయకుండా మీ వ్యక్తిగత భద్రతను దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని మీతో పాటు మీ కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకొని హెల్మెట్ ధరించే విషయంపై జాగ్రత్త వహించాలని మనవి చేశారు. హెల్మెట్ ధరించే వారినీ ఆపి గులాబీ పూలతో అభినందించారు.
నందిగామ: హెల్మెట్ పై అవగాహన కార్యక్రమం చేపట్టిన ఏసిపి తిలక్
RELATED ARTICLES