TEJA NEWS TV
యన్టీఆర్ జిల్ల నందిగామ పట్టణం లో “ఆటో డ్రైవర్ల సేవలో” పథకం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మాట్లాడుతూ నందిగామ నియోజకవర్గంలో మొత్తం 2,511 మంది లబ్ధిదారులకు రూ.3 కోట్లు 75 లక్షలు నేరుగా ఆటో మరియు క్యాబ్ డ్రైవర్‌ల ఖాతాలలో జమ చేయడం జరిగినట్లు ఆమె వెల్లడించారు.
ఈ కార్యక్రమం లో భాగంగా ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య రైతుపేట పార్టీ కార్యాలయం నుండి సీఎం రోడ్, గాంధీ సెంటర్, మెయిన్ సెంటర్ మీదుగా పాత బస్టాండ్ సెంటర్‌లోని బాబు జగజీవన్ రామ్ బిల్డింగ్ వరకు ఆటో ర్యాలీలో ఆటో మరియు క్యాబ్ డ్రైవర్ సోదరులతో కలిసి ఆటోలో ప్రయాణించారు .
ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ శ్రీమతి మండవ కృష్ణకుమారి, భారతీయ జనతా పార్టీ నియోజకవర్గ కన్వీనర్ తొర్లికొండ సీతారామయ్య, వివిధ హోదాల కూటమి నేతలు, వివిధ హోదాల కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్లు, ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘం చైర్మన్లు,టిడిపి, జనసేన కార్యకర్తలు, నాయకులు,ఆర్డిఓ, మున్సిపల్ కమిషనర్, రవాణా శాఖ అధికారులు,ఎమ్మార్వో,ఎండిఓ, వివిధ హోదాల అధికారులు, ఆటో మరియు క్యాబ్ డ్రైవర్ల సంఘ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
నందిగామ లో ఆటో డ్రైవర్ల సేవలో పథకం ఘనంగా ప్రారంభమైనది
RELATED ARTICLES



