*ఎన్టీఆర్ జిల్లా నందిగామ రైతు బజార్ ని తనిఖీ చేసిన జిల్లా జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి కే, మంగమ్మ, మరియు జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారులు*
*నందిగామ రైతు బజార్ లోని కార్యాలయంలో రికార్డులను తనిఖీ చేశారు*
*ఈఓ. రవికుమార్ ను రైతు బజారు లోని వివరాలను అడిగి తెలుసుకున్నారు.*
ది 12/07/2024 శుక్రవారం ఉదయం నందిగామ రైతు బజార్ ను అకస్మాత్తుగా తనిఖీ చేసిన మార్కెటింగ్ శాఖ A D మరియు ఇతర సిబ్బంది
రైతు బజార్లో దళారుల వ్యవస్థ పెరిగిపోతుందని ఓ ప్రముఖ దినపత్రికలో వచ్చిన వార్తకు
వెంటనే స్పందించి న మార్కెటింగ్ శాఖ అధికారులు.
రైతు బజార్ లో ఉన్నటువంటి
అన్ని దుకాణాలను తనిఖీ చేసిన మార్కెటింగ్ శాఖ అధికారులు
రైతులు పండించిన పంటని తాము అమ్ముకోవడం కొరకు రైతు బజారుకు తీసుకొచ్చిన పంటని వారిని అమ్ముకోనేకుండా చేసి
దళారీ వ్యవస్థకి దుకాణాలను కట్టబెట్టినట్టు మార్కెటింగ్ శాఖ అధికారులు కొన్ని దుకాణాలను కనిపెట్టడం జరిగింది.
నందిగామ రైతు బజారులో
నందిగామ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతుల కష్టపడి పండించిన పంటను వారిని అమ్ముకొనియకుండా దళారీ వ్యవస్థను ప్రోత్సహిస్తున్న నందిగామ రైతు బజార్ లోని కొంతమంది వ్యక్తులు.
వాటిని గుర్తించి వారిని వెంటనే తీసివేయాలని ఆ షాపులను ముయిoచేసి సరైనటువంటి రైతులకు డ్వాక్రా మహిళలకు ఆ షాపులను కట్టబెట్టాలని తెలియజేసిన ఉన్నత అధికారులు.