TEJA NEWS TV : నేడు నందిగామ పట్టణంలో AITUC ఆధ్వర్యంలో మునిసిపల్ పారిశుద్ధ కార్మికుల సమ్మెకు జనసేన నాయకులు తో కలిసి నందిగామ జనసేన సమన్వయకర్త తంబళ్లపల్లి రమాదేవి వారికి మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా రమాదేవి మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి గారు పాదయాత్ర సమయంలో ఇచ్చిన అబద్ధపు హామీల్లో పారిశుద్ధ కార్మికులకు కూడా హామీ ఇచ్చారు. వారి ఉద్యోగాలు రెగ్యులరైజ్ చేస్తానని, వారి జీతం పెంచుతానని అన్నారు. కానీ నేడు వాళ్ళ ఉద్యోగాలు రెగ్యులరైజ్ చేయకపోగా వారిని వారి శ్రమని దోచుకుంటూ వారికి ఎటువంటి ప్రభుత్వ పథకాలు అందకుండా చేస్తున్నారు. 26000 జీతం ఇస్తానని చెప్పి కేవలం 15 వేల రూపాయలు మాత్రమే వారికి ఇస్తున్నారు. కరోనా సమయంలో పారిశుద్ధ్య కార్మికులు ఎంతో కష్టపడ్డారు, ఎన్నో విధాల ప్రజలకు సేవలు అందించారు. ఎంతోమంది ప్రాణాలను కూడా కోల్పోయారు. అవన్నీ నేడు మరచిపోయి ఈ వైసిపి ప్రభుత్వం వారిని గాలికి వదిలేసారు. ఈరోజు వాళ్ళు రోడ్లెక్కి సమ్మె చేసే పరిస్థితికి తీసుకొచ్చారు. కష్టంలో ఉన్న ప్రతి ఒక్కరికి జనసేన అండగా ఉంటుందని, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కార్మికులందరికీ అండగా నిలుస్తారని తెలియజేశారు
నందిగామ: మునిసిపల్ పారిశుద్ధ కార్మికుల సమ్మెకు మద్దతు తెలిపిన జనసేన నాయకురాలు తంబళ్లపల్లి రమాదేవి
RELATED ARTICLES