TEJA NEWS TV :
ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం రిపోర్టర్
ఫుడ్ లైసెన్స్ లేకుండా హోటల్స్ నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటా ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్న హోటల్ నిర్వాహకులకు మాస్ వార్నింగ్ ఇచ్చిన నందిగామ పురపాలక సంఘం కమిషనర్ ఈవీ రమణబాబు*
ప్రజల ఆరోగ్యానికి హాని కలగజేస్తే చూస్తూ ఊరుకోను మున్సిపల్ కమిషనర్ ఈవి రమణబాబు*
నందిగామ పట్టణ పరిధిలోని CM రోడ్డు లోని హోటల్స్ ను తనిఖీ చేసిన మున్సిపల్ కమిషనర్ తనిఖీ సమయమున హోటల్స్ నిర్వహించు హోటల్ యజమానులు ఫుడ్ లైసెన్సు లేకుండానే వారి ఇష్టానుసారముగా రోడ్డు మీద నిర్మించిన డ్రైనేజి ల మీద వారి యొక్క దుకాణములు నిర్వహించుచూ వారి యొక్క వాడకమును రహదారిలోని డ్రైనేజి లో కలుపుతున్నందున డ్రైనేజి వ్యవస్థ దెబ్బతినుచున్నది. కావున హోటల్ యజమానులను ఫుడ్ లైసెన్సు లేకుండా హోటల్స్ నిర్వహించినయెడల వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొనబడునని హెచ్చరించడమైనది.
ఆదేవిధముగా హోటల్స్ లోపల ఎటువంటి శుభ్రత కూడా పాటించకుండా యాదేచ్చగా హోటల్స్ నిర్వహించుచున్నారనియు అందువలన ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు ఎదురైనచో అట్టివారిపై తగు చర్యలు తీసుకొనబడునని హెచ్చరికలు జారీ చేసియున్నారు.ఆదేవిధముగా హోటల్స్ నిర్వహించు యాజమానులను వారి హోటల్స్ నందు ఉన్న మంచి నీటిని డ్రైనేజిలో కలిపే విధముగా ను మరియు నిరుపయోగకరమైన వాడకమును నిల్వ ఉంచి బయటకు వెళ్ళే ప్రత్యామ్నాయ మార్గమును చూసుకొనవలసినదిగా హెచ్చరించుచూ ది.05.12.2024వ తేదీ అనగా గురువారం మద్యాహ్నం CM రోడ్డు నందు ప్రత్యేక శానిటేషన్ నిర్వహించవలసినదిగా వార్డు శానిటేషన్ & ఎన్విరాన్మెంట్ సెక్రెటరీ వారలను ఆదేశించుట జరిగినది.సదరు తనిఖీ నందు నందిగామ పురపాలకసంఘ, శానిటరీ ఇన్స్పెక్టర్ (I/c), సచివాలయ వార్డు శానిటేషన్ & ఎన్విరాన్మెంట్ సెక్రెటరీ వారలు పాల్గొన్నారు