ఎన్టీఆర్ జిల్లా, నందిగామ
నందిగామనియోజకవర్గంలోని 42 మంది బాధితులకు సీఎం సహాయ నిధి సుమారు రూ.38 లక్షల 98 వేల 135 రూపాయలు
చెక్కులు పంపిణీ చేసిన ఏపీ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య
రాజకీయాలకు అతీతంగా సీఎం సహాయనిధి
పేద వర్గాలను ఆదుకుంటున్న ప్రభుత్వం మాది : తంగిరాల సౌమ్య
ఎన్టీఆర్ జిల్లా, నందిగామ
రాజకీయాలకు అతీ తంగా సీఎం సహాయనిధి ద్వారా పేద వర్గాలను ఆదుకుంటున్న ప్రభుత్వం తమదని స్థానిక ఎమ్మెల్యే, ఏపీ విప్ శ్రీమతి తంగిరాల సౌమ్య పేర్కొన్నారు.
నందిగామ పట్టణం కాకాని నగర్ కార్యాలయంలో శనివారం నందిగామ నియోజకవర్గంలోని 42 మందికి సీఎం సహాయ నిధి ద్వారా *రూ.38 లక్షల 98 వేల 135 రూపాయల* చెక్కులను ఎమ్మె ల్యే అందజేశారు.
వైద్య సహాయం కోసం సీఎం చంద్రబాబు అందించిన నిధులు తమకు అందేలా కృషి చేసిన ఎమ్మెల్యేకి బాధితులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మాట్లాడుతూ… వైద్య పరంగా అధికంగా ఖర్చులు పెట్టుకొనే వారికి సీఎంఆర్‌ఎఫ్ ఎంతగానో ఉపయోగపడుతోందన్నారు. పార్టీలకతీతంగా అందిస్తున్నట్లు తెలిపారు.
నందిగామ: పేద వర్గాలను ఆదుకుంటున్న ప్రభుత్వం మాది : తంగిరాల సౌమ్య
RELATED ARTICLES