ది:22/08/25,
నందిగామ.
తెలుగు సినిమా వెండితెర ఇలవేల్పు, అభిమానుల ఆలయ శిఖరం, స్వయంకృషికి పట్టుదలకు నిలువెత్తు రూపం పద్మ విభూషణం డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి గారి 70 జన్మదిన వేడుకలను నందిగామ నియోజకవర్గ చిరంజీవి యువత అధ్యక్షులు పోలిశెట్టి వరుణ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. నందిగామ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్సల కొరకు వైద్యం తీసుకుంటున్న పేషెంట్లకు పండ్లు, కాయలు పంపిణీ చేయడం జరిగింది.
ఇటీవల గుండెకు శాస్త్ర చికిత్స చూపించుకున్న మెగాస్టార్ చిరంజీవి గారి అభిమాని మునగచెర్ల గ్రామ జన సైనికుడు తానూరి సుధాకర్ ను తన నివాసంలో కలసి పరామర్శించి జనసైనికులు మరియు వీర మహిళల ఆర్థిక సహకారంతో రూ.40,000 రూపాయలు సుధాకర్ కు అందజేయడం జరిగింది భవిష్యత్తులో కూడా పార్టీ తనకు అండగా ఉంటుందని తెలియజేయడం జరిగింది.
అనంతరం నందిగామ పట్టణం గాంధీ సెంటర్ నందు ఏర్పాటుచేసిన “మెగాస్టార్ చిరంజీవి” గారి ఫ్లెక్సీ వద్ద అభిమానుల కోలహాలామ్ మధ్య బాణాస సంఖ్య గెలుస్తూ భారీ కేకును కట్ చేసి అభిమానులకు పంచటం జరిగింది. చిరంజీవి గారి స్ఫూర్తితో భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు జనసైనికులు చేస్తూ ముందుకు పోతారని జనసేన పార్టీ నాయకులు పూజారి రాజేష్ అన్నారు.
ఈ కార్యక్రమంలో చిరంజీవి గారి అభిమానులు, జనసేన పార్టీ 20వ వార్డు కౌన్సిలర్ తాటి వెంకటకృష్ణ, తాటి రామకృష్ణ, ఆకుల వెంకట్, పటాన్ రజాక్, పటాన్ సుభాని, దారెల్లి అరుణ్ కుమార్, తాటి ఫణీంద్ర, గోపిగుండాల, మద్దు శ్రీనివాస్ పలువురు చిరంజీవి అభిమానులు మరియు జనసైనికులు పాల్గొని మెగాస్టార్ చిరంజీవి గారి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది.
ఇట్లు
చిరంజీవి యువత
నందిగామ నియోజకవర్గం.
నందిగామ పట్టణంలో ఘనంగా మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు
RELATED ARTICLES