Wednesday, February 5, 2025

నందిగామ నియోజకవర్గ నాగార్జునసాగర్ ఎన్.యస్.పి.క్వార్టర్స్ డిస్ట్రిబ్యూటరీ కమిటీ.నెం – 12 . లో ప్రైవేటు కార్యాలయాల ఏర్పాటు… నియోజకవర్గ రైతుల ఆగ్రహం

ఎన్టీఆర్ జిల్లా నందిగామ

💥 *నందిగామ నియోజకవర్గ నాగార్జునసాగర్ ఎన్.యస్.పి.క్వార్టర్స్ డిస్ట్రిబ్యూటరీ కమిటీ.నెం – 12 . లో ప్రైవేటు కార్యాలయాల ఏర్పాటు… నియోజకవర్గ రైతుల ఆగ్రహం*

*ఎన్టీఆర్ జిల్లా నందిగామ పట్టణంలో గల రైతు బజార్ దగ్గర ఉన్న నాగార్జునసాగర్ ఎన్.ఎస్పి. క్వార్టర్స్ లో గల స్థలం లో కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు తమ కార్యకలాపాలు నిర్వహించుకోవడం కోసం క్వార్టర్స్ లో ఉన్న భవనాలలో ప్రైవేటు కార్యాలయాలను ఏర్పాటు చేసుకున్నారు.*

*ప్రభుత్వ ఉద్దేశం ప్రకారం నాగార్జునసాగర్ డ్యాం కాలువలు కలిగిన ఎన్ఎస్పి. క్వార్టర్స్ ను ఆయా శాఖలకు సంబంధించిన అధికారులకు నివాసాలకు వారి కార్యాలయాల ఏర్పాటుకు, ఎన్ఎస్పీ . కాలువల పరిధిలోగల నందిగామ నియోజకవర్గ ఆయకట్టు రైతుల సమస్యల పరిష్కారం కోసం , రైతులు సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం కోసం కేటాయించటం జరిగింది.*

*అయితే దీనిని కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు తమ సొంత కార్యకలాపాలకు కార్యాలయాలుగా వినియోగించుకుంటున్నారు.*

*ఎన్టీఆర్ జిల్లా నందిగామ డిస్ట్రిబ్యూటరీ కమిటీ నెం.12 (NSP). క్వార్టర్స్ లో విలేకరుల కార్యాలయం, కళాకారుల భవన కార్యాలయం, నూతనంగా విశ్వబ్రాహ్మణుల కార్యాలయాలు తదితర ప్రైవేటు కార్యాలయాలు ఎటువంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా ఏర్పాటు చేసుకోవడం ఏమిటని నందిగామ నియోజకవర్గ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.*

*ఇప్పటికే ఈ స్థలాన్ని ఒకపక్క రైతు బజారు, అన్న క్యాంటీన్ తదితర వాటికి ఉపయోగించుకుంటున్నారు.*

*ఇంకా ఉన్న కొద్దిపాటి క్వార్టర్స్ భవనాలను కూడా ప్రైవేటు కార్యకలాపాలకు , ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వటం ఏమిటని సంబంధిత శాఖ ల అధికారులపై నాగార్జునసాగర్ యన్.యస్.పి. నందిగామ నియోజకవర్గ పరిధిలోగల రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు….

*ఏ ప్రాతిపదికన ప్రైవేట్ వ్యక్తులకు ఎన్ఎస్పి. క్వార్టర్స్ భవనాలను కేటాయించారని సంబంధిత నాగార్జునసాగర్ నందిగామ నియోజకవర్గ ఎన్ఎస్పి. నీటి పారుదల శాఖ అధికారులను నందిగామ నియోజకవర్గ రైతులు ప్రశ్నిస్తున్నారు.*

*ప్రభుత్వం ఇప్పటికైనా ఎన్.ఎస్పి. క్వార్టర్స్ లో అక్రమంగా ఏర్పాటు చేసుకున్న ప్రైవేటు కార్యాలయాలను తొలగించి నందిగామ నియోజకవర్గ ఎన్.ఎస్పి. ఆయకట్టు రైతులకు వారి సమస్యల పరిష్కారం కోసం సభలు, సమావేశాలు ఏర్పాటు చేసుకోవడానికి మరియు ఎన్ఎస్పి. అధికారుల కార్యాలయాలకు ఉపయోగించుకోవటానికి వినియోగంలోకి తీసుకువచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని నందిగామ నియోజకవర్గ పరిధిలోగల ఎన్ఎస్పి. ఆయకట్టు రైతులు డిమాండ్ చేస్తున్నారు.*

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular