నందిగామ, సెప్టెంబర్ 12: ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ మరియు మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ ఆదేశాల మేరకు, నందిగామ పురపాలక సంఘ పరిధిలో త్రాగునీటి సరఫరా వ్యవస్థను మరింత మెరుగుపరిచే చర్యలు చేపట్టారు. మున్నేరు, కీసర పంపింగ్ స్కీంలు సహా అన్ని రిజర్వాయర్ల వద్ద నీటి శాంపిల్స్‌ను రీజినల్ పబ్లిక్ హెల్త్ లాబరేటరీ, గుంటూరు వారు పరీక్షించి, త్రాగునీటిగా అనుకూలమని నివేదిక ఇచ్చారు.
పట్టణంలోని రిజర్వాయర్లు మరియు సంపులు శుభ్రపరచబడినట్లు అధికారులు తెలిపారు. ప్రతి రోజు RC టెస్టింగ్ ద్వారా క్లోరిన్ స్థాయిని పరిశీలిస్తూ, ప్రజలకు ఆరోగ్యకరమైన నీటిని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
భారీ వర్షాల నేపథ్యంలో, ప్రజలకు కొన్ని ముఖ్యమైన సూచనలు చేశారు:
మీ ఇంటి వాటర్ ట్యాంక్‌ను నెలకు ఒకసారి శుభ్రపరచాలి
డ్రైనేజ్ పక్కన ఉన్న మంచినీటి సంపులో లీకేజీలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి
ప్రభుత్వ అనుమతులు ఉన్న వాటర్ ప్లాంట్ల నుంచే వాటర్ టిన్నులు కొనుగోలు చేయాలి
కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తాగాలి
నిల్వ ఉన్న ఆహార పదార్థాలు తినకూడదు
హోటల్స్, ఇన్స్టిట్యూట్లలో సురక్షిత తాగునీటి ఏర్పాట్లు చేయాలి
పరిసర ప్రాంతాల్లో డ్రెయిన్లు, వ్యర్థాలు నిల్వ లేకుండా శుభ్రంగా ఉంచాలి
ఆహార పదార్థాలు తినే ముందు చేతులు శుభ్రంగా కడగాలి
డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధుల లక్షణాలు కనిపిస్తే వెంటనే ప్రభుత్వ వైద్య సహాయం పొందాలి
త్రాగునీటి ట్యాంకర్ల సమయాల కోసం శ్రీ జి. రంగారావు (పిట్టర్) ను 9912282157 నంబరులో సంప్రదించవచ్చు.
నందిగామ మున్సిపల్ అధికారులు ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు అప్రమత్తంగా ఉన్నారు.
నందిగామ త్రాగునీటి ట్యాంక్ శుభ్రత – ప్రజలకు అప్రమత్తత సూచనలు
RELATED ARTICLES