TEJANEWSTV :ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గానికి చెందిన జనసేన పార్టీ వీర మహిళ శ్రీలక్ష్మి గారికి ఘన గౌరవం దక్కింది.
ఝాన్సీ రాణి రుద్రమదేవిలా ప్రజలకు సేవ చేస్తూ, పార్టీ కోసం అహర్నిశలు శ్రమించిన శ్రీలక్ష్మికి శ్రీ సీతారామాంజనేయ దేవస్థానం పాలకవర్గ సభ్యురాలిగా బాధ్యతలు అప్పగించారు.
జనసేన పార్టీ కోసం కష్టకాలంలోనూ వెనుకడుగు వేయకుండా, ప్రజా సమస్యలపై, మహిళల హక్కులపై, స్థానిక ఇబ్బందులపై పోరాడిన శ్రీలక్ష్మి సేవలను గుర్తిస్తూ ఈ బాధ్యత ఇచ్చినట్లు తెలియజేశారు.
శ్రీలక్ష్మి గారు ఈ బాధ్యతను నిజాయితీగా, ప్రజాసేవ ధర్మంతో నిర్వర్తిస్తారని, దేవాలయ అభివృద్ధికి కృషి చేస్తారని నాయకులు, కార్యకర్తలు మరియు మహిళా శక్తి విశ్వాసం వ్యక్తం చేశారు.
నందిగామలో జనసేన వీర మహిళ శ్రీలక్ష్మికి దేవస్థాన పాలకవర్గ సభ్యత్వం
RELATED ARTICLES



