TEJA NEWS TV : ప్రతిభ హై స్కూల్లో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే సౌమ్య
రక్తదాతల్ని అభినందించిన ఎమ్మెల్యే
రక్తదానం ప్రాణదానంతో సమానం
రక్తదానం చేసిన ప్రతి ఒక్కరూ హీరోనే
నందిగామ పట్టణం ప్రతిభ హైస్కూల్లో రక్తదాన శిబిరాన్ని నందిగామ స్థానిక ఎమ్మెల్యే సౌమ్య ఉదయం ప్రారంభించారు.
ఎమ్మెల్యే సౌమ్య మాట్లాడుతూ రక్తదానం ప్రాణదానంతో సమానం, యువత రక్తదానంలో ముందుండాలని, రక్తదానం చేయడం వల్ల మరో ఒక్కరికి జీవితాన్ని ఇచ్చిన వారవుతామని అన్నారు అనంతరం ప్రతిభ హై స్కూల్ యాజమాన్యం షేర్ అలీ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగే మీలాద్ ఉన్ నబి మొహమ్మద్ ప్రవక్త జన్మించిన రోజున పురస్కరించుకొని నాలుగవసారి కార్యక్రమాన్ని నిర్వహించామని మీరు ఇచ్చే రక్తం వేరే ఒకరి జీవితం ఒకరికి దానం మరొకరి ప్రాణం అవ్వాలని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో రక్త దాతలు,కూటమి నేతలు, స్కూల్ యాజమాన్యం, తదితరులు పాల్గొన్నారు.
నందిగామ:ప్రతిభ హై స్కూల్లో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే సౌమ్య
RELATED ARTICLES